కృష్ణ

గ్రంథ పఠనంపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 17: విద్యార్థులు గ్రంథ పఠనంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు విద్యావేత్తలు కృషి చేయాలని కృష్ణావిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భారతీయ సాహిత్యపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పురాతన గ్రంథాలను డిజిటలైజేషన్ ద్వారా భద్రపర్చడానికి కృష్ణా విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రంథాలయాలను ఆధునీకరించాలన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో గ్రంథాలయాలను పటిష్టపరుస్తున్నట్లు, విద్యార్థులకు రాయితీపై పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం యేలేశ్వరపు పూర్ణచంద్రరావు నిర్వహణలో కెడీపీ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముదిగొండ శాస్ర్తీ సమన్వయకర్తగా వ్యవహరించారు. సయ్యద్ పీర్, అంగర తులసీదాస్, కాసాని భాగ్యారావు, జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉప గ్రంథాలయాధికారి ఎంవిడిటి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన వక్తృత్వ పోటీలను ఎల్‌ఐసి రిటైర్డ్ ఎఎఓ శాస్ర్తీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి పర్యవేక్షించారు. మధ్యాహ్నం రామాపురం పాఠశాల ఉపాధ్యాయులు వి శివరామకృష్ణ క్విజ్ పోటీలు నిర్వహించారు.

ప్రజలకు చేరువగా చంద్రన్న ఆరోగ్య కేంద్రాలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 17: చంద్రన్న ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక 27వ వార్డులోని చంద్ర న్న ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు అం దుతున్న వైద్య సేవలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకించి గర్భిణులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు దోమ తెరలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జి ల్లా ప్రభుత్వా స్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ అబ్దుల్ అజీమ్, కౌన్సిలర్ ధనలక్ష్మి, 27వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ నాగులు తదితరులు పాల్గొన్నారు.