కృష్ణ

దాళ్వాపై పట్టు పట్టేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 17: నేడు జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్షాలు దాళ్వాపై పట్టు పట్టేనా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డెల్టాలో ఖరీఫ్ సాగు ముగింపు దశకు చేరింది. రెండవ పంటకు దాళ్వాకు నీరు ఇస్తారా? ఇవ్వరా? అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. వ్యవసాయ శాఖ మాత్రం దాళ్వా ఊసు ఎత్తకుండానే రెండవ పంటగా ఆరుతడి సాగు చేసుకోవాలని గ్రామగ్రామాన రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ఆ మేరకు ఆరుతడి పంటలకు కావల్సిన విత్తనాలను సైతం సబ్సిడీపై పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దాళ్వాపై రైతుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ముగింపునకు వచ్చిన నేపథ్యంలో తర్వాత పంటగా ఏం సాగు చేయాలి అనే అంశంపై రైతులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. డెల్టా శివారు ప్రాంతాలైన కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, అవనిగడ్డ, చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, మోపిదేవి తదితర ప్రాంతాల్లో ఆరుతడి పంటల వల్ల తమకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. దాళ్వా ఉంటేనే తమ పరిస్థితులు మెరుగుపడతాయని చెబుతున్నారు. ఇప్పటికే పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన ప్రాంత రైతులు దాళ్వాకు నీరు ఇవ్వాలంటూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వీరి ఆందోళనకు ప్రతిపక్షం మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లాలో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశం ప్రజా ప్రతినిధులకు వేదికగా ఉంటుంది. సాక్షాత్తు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దాళ్వాపై పట్టు పట్టేందుకు ప్రతిపక్షంతో పాటు అధికార పక్ష సభ్యులు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లో ప్రతిపక్షానికి సరైన బలం లేకపోయినా ప్రధాన సమస్యలపై కొంత మేర పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దాళ్వాపై అధికార ప్రక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైనట్టు సమాచారం. డెల్టా శివారు ప్రాంతమైన పెడన నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ కూడా రైతుల పక్షాన నిలబడి దాళ్వాపై ఈ సమావేశంలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పెడన నియోజకవర్గంలో ఆరుతడి పంటల వల్ల రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదు. ఆరుతడి పంటలను సాగు చేస్తే రైతు నష్టపోక తప్పదు. ఈ క్రమంలో పెడన నియోజకవర్గానికైనా దాళ్వాకు నీరు తీసుకురావాలని రైతులు ఎమ్మెల్యే కాగితపై తీవ్ర వత్తిడి తీసుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ఒక్క దాళ్వాకు కూడా నీరు ఇవ్వని పరిస్థితి ఉంది. పట్టిసీమ ద్వారా సార్వాకు నీరు తీసుకు వచ్చి పంటలను కాపాడినా దాళ్వా విషయంలో మాత్రం ప్రభుత్వం చేతులెత్తేస్తూ వచ్చింది. మరో ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ విడత అయినా దాళ్వాకు నీరు ఇస్తే రైతుల మెప్పు పొందవచ్చని కొంతమంది అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే వాదనను నేటి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వినిపించి జలవనరుల శాఖ మంత్రి ద్వారా దాళ్వాకు నీరు ఇస్తామని ప్రకటన చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి నేటి సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దాళ్వాపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ఆకట్టుకున్న అష్ఠావధానం
అవనిగడ్డ, నవంబర్ 17: 50 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన అష్టావధానం కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. అవధాన శేఖర అచ్చ తెలుగు శతావధాని డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్ అచ్చ తెలుగు అష్ఠావధానం నిర్వహించగా, డా. విష్ణుప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సింహాద్రి పద్మ ఆసువుగా, ఝాన్సీ వర్ణనగాను, పూషడపు సుబ్బారావు పురాణం, సాయి ఫణికృష్ణ దత్తపది, రమాకుమారి అంత్యాక్షరి, కామేశ్వరి ప్రసాద్ సమస్యాతోరణంలో వ్యవహరించారు. ముఖ్యంగా సాయి ఫణికృష్ణ దత్తపదిగా మెగా, రెబల్, ఫవర్‌లపై సప్తపదిని పూర్తి చేయమని అనగా కాళేశ్వరప్రసాద్ అల్లంతిని నెలల పిల్ల హాయిగ నవ్వేన్ అనే అంశంపై సమస్య ఇవ్వటం జరిగింది. ఈ సమ్మితిని అవధాని శ్యామలానంద ప్రసాద్ సమాధాన పర్చారు. అనంతరం నాకు నచ్చిన పుస్తకంపై కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా బారా సుజాత, పి కృష్ణకుమారి సహకరించారు.

భక్తిశ్రద్ధలతో గోపూజ
కూచిపూడి, నవంబర్ 17: మొవ్వ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహశీల్దార్ బి రామానాయక్ దంపతులు భక్తిశ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. కార్తీక మాసం ముగియనుండటంతో మాస శివరాత్రిని పురస్కరించుకుని తహశీల్దార్ కార్యాలయంలో వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక దామోదరపూజ నిర్వహించారు. దీవి సీతారామ హనుమాన్ పౌరహిత్యంలో శాస్త్రోక్తంగా తహశీల్దార్ రామానాయక్ దంపతులు పూజలు నిర్వహించి తీర్ధప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఎన్‌వి కుమారి, సీనియర్ అసిస్టెంట్ జె శ్రీనివాసరావు, విఆర్‌ఓల దంపతులు, రేషన్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.