కృష్ణ

లాభాల్లో రెండు శాతం నిధులను గ్రామాల్లోనే ఖర్చుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: పరిశ్రమలు సమకూర్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను (సీఎస్‌ఆర్ ఫండ్స్) గ్రామాల్లో కనీస వసతుల కల్పనకు ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశ్రమల ప్రతినిధులను కోరారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశ్రమల నిర్వాహకులు, పరిశ్రమల శాఖ అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల (సిఎస్‌ఆర్ ఫండ్స్)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలు వాటికి వచ్చే లాభాలలో 2 శాతం నిధులను తప్పనిసరిగా గ్రామాల్లో వౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు , అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, మొక్కలునాటడం వంటి పనులకు ఖర్చు చేయాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి గ్రామాలపైనే ఆధారపడి ఉన్నందున కనీసం వౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలోని 100 గ్రామాలను అన్ని వౌలిక వసతులతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన టాటా ట్రస్ట్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే అంటురోగాలు దరిచేరవని శానిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వీలుగా మూడు చక్రాల బండ్లు, తడి, పొడి చెత్తలను వేరు చేసేవిధంగా డస్ట్‌బిన్స్ పంపిణీకి నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్ అన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. ప్రతి నెల క్రమం తప్పక సిఎస్‌ఆర్‌పై సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో పరిశ్రమల వివరాలు, వారు చేస్తున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల (సీఎస్‌ఆర్ ఫండ్స్)తో ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు, జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, స్థాపించిన పరిశ్రమలలో కార్యక్రమాలపై జాయింటు కలెక్టర్-2 అధ్యక్షతన సంబంధిత ఆర్‌డివోలు, తహశీల్దార్లు సమగ్ర నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
సింగిల్ విండోలో త్వరితగతిన అనుమతులు
* కలెక్టర్ ఆదేశం
పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వాటి అర్హతలను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. అనుమతుల మంజూరులో ఎదురయ్యే ఇబ్బందులను తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో కొండపల్లి హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు చెందిన చార్మినార్ ఎసి షీట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జి.కొండూరులో అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి రూ.2 లక్షలు సీఎస్‌ఆర్ నిధుల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు.