కృష్ణ

రాష్టస్థ్రాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, నవంబర్ 18: పట్టణంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో నాల్గవ రాష్ట్ర స్థాయి అంతర జిల్లాల జూనియర్, సీనియర్ మరియు మాస్టర్ స్ర్తిలు, పురుషుల పవర్ లిప్టింగ్ పోటీలను మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300మంది లిఫ్టర్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపి మరింత ఉన్నత స్థితి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషిన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, ఎస్ కోటేశ్వరరావు, జిల్లా నేత ఘంటా వెంకటేశ్వర్లు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
కలిదిండి, నవంబర్ 18: తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) అన్నారు. మండల పరిధిలోని మూలలంక మూరుప్పడగూడెంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వారు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలిదిండి ప్రధాన సెంటరు నుండి భారీ ర్యాలీగా మూరుప్పడగూడెంకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కొంతమంది పదవీ కాంక్షతోనే రాజకీయాన్ని వాడుకుంటున్నారన్నారు. ఎవరు ఏమైనా ఓటర్లే గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, ఎఎంసీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, మండల టీడీపీ అధ్యక్షుడు పోకల జోగిరాజు, బీజెపీ అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, నీటి సంఘాల అధ్యక్షులు, బీజెపీ నేతలు నంబూరి నాగబాబు, చిట్టూరి రవీంద్ర, తాడినాడ బాబు, జిల్లా నాయకులు, బీజెపీ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.