కృష్ణ

తోట్లవల్లూరు భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 18: తోట్లవల్లూరు మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల సమయంలో అర్ధగంట పాటు కురిసిన భారీ వర్షానికి వరి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. తోట్లవల్లూరు, వల్లూరుపాలెం తదితర గ్రామాల్లో వరి కొతలు కోసి ఎండుతున్న పనలు వానకు తడిసి ముద్దయ్యాయి. వరిపనలు నీటిలో నానుతుండటంతో మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అలాగే వరిలో చల్లిన మినప విత్తనాలు నీటికి చనిపోయే అవకాశం ఉందని, దాంతో రెండోసారి మినప విత్తనాలు చల్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో రైతులు వరికోతలను నిలిపి వేశారు.

అన్నదాతను హడలెత్తించిన ఆకాల వర్షం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 18: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా శనివారం ఉదయం కురిసిన ఓ మోస్తరు వర్షం రైతాంగాన్ని హడలెత్తించింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంతో పాటు చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ తదితర మండలాల్లో కురిసిన ఆకాల వర్షానికి నిడివి మీద ఉన్న వరి పంట చాపచుట్టగా పడిపోయింది. కోతలకు సిద్ధమైన వరి పంట కళ్ల ముందే పడిపోవటంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలలో కోతలు కోయడంతో వరి పనలు తడిసిముద్దయ్యాయి. మధ్యాహ్నం ఎండపొర రావటంతో రైతులు పొలాల్లోని నీటిని బయటకు తీయటం, పడిపోయిన పంటను రక్షించుకునే చర్యలలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా వరి పంట ఆశాజనకంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే కంకులు బరువెక్కి చాపచుట్టగా పడిపోతున్నాయి.
ఆకట్టుకున్న సాహిత్య రూపకం
*దివిసీమ కవి దిగ్గజ వైభవం
అవనిగడ్డ, నవంబర్ 18: స్థానిక గ్రంథాలయంలో వారోత్సవ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శనివారం ప్రదర్శించిన దివిసీమ కవి దిగ్గజ వైభవం అనే సాహిత్య రూపకం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాహిత్య రూపకంలో శ్రీకాకుళం వద్ద కృష్ణానది దాటవల్సిన యాత్రీకులు వేళమించి పోవటంతో పడవ దొరకక శ్రీ ఆంధ్ర మహావిష్ణువు ఆలయ ముఖ మంటపంలో నిద్రకు ఉపక్రమించగా ఆంధ్ర నాయకుడు ప్రత్యక్షమవటం, ఒక జానపదుడు స్వామిని గుర్తించడం, దివిసీమ వైభవాన్ని గేయంగా పాడటం, స్వామి ఆనందంతో దివిసీమ కవి దిగ్గజాలను అతనికి సాక్షాత్కరింపచేసి వారి కవితా విశేషాలను తెలియజేయటం ఈ సాహిత్యరూపకం ప్రధాన సారాంశం. ఈ రూపకంలో ఆంధ్ర మహావిష్ణువుగా పూషడపు వెంకట సుబ్బారావు, జానపదులుగా సూరగం రామకృష్ణప్రసాద్, కాసుల పురుషోత్తమ కవిగా డా. విష్ణుప్రసాద్, గాయప సేనానిగా కె వెంకటేష్, వేటూరి ప్రభాకరశాస్ర్తీగా యం కిషోర్, కొడాలి సుబ్బారావుగా నల్లూరి లక్ష్మీనారాయణ భట్టాచార్యుడు, తుంగల లక్ష్మీకాంతంగా కన్నాల ప్రభాకరశర్మ, మాదయ్యగారి మల్లన్నగా కూచిభొట్ల శ్రీనివాసశర్మ, అనంతమాత్యుడుగా వై గురవయ్య అద్భుతంగా పద్యాలను ఆలపించి దివిసీమ కవి దిగ్గజాలను కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. నెహ్రూ, స్వచ్ఛ్భారత్, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రాలను వేశారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మత్తి శేషగిరిరావు భారతీయ సంస్కృతిపై ప్రసంగించారు.