కృష్ణ

వ్యవసాయ రంగాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 18: వ్యవసాయం రంగంలో అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధిక దిగుబడుల సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వేదికగా ఏపీ అగ్రిటెక్ సమ్మిట్ నిర్వహించి ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్ దృష్టిని ఆకర్షించారన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని బతికించేందుకు ఎపి అగ్రిటెక్ సమ్మిట్ ఎంతగానో దోహదపడనుందన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పర్చే విషయంలో నీటి భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించి కృష్ణాడెల్టాలోని 13లక్షల ఎకరాల్లో పంటలను కాపాడిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 102 టీఎంసీల నీటిని అందించామన్నారు. రూ.4900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేసి మెట్ట భూములను సైతం సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. ఆంధ్రాకు జీవనాడి అయిన పోలవరం నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి సోమవారం పోలవరంపై సిఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారన్నారు. పట్టిసీమ నీటితో రైతులు కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల్వెవరూ దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. దళారులెవ్వరైనా రైతులను మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ఆ శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగాన్ని గాడిన పెట్టామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా వైద్య సేవల్లో లోపాలు జరిగినట్లు తెలిస్తే సంబంధిత వైద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ అన్ని పిహెచ్‌సీల్లో ఇసీజీ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ మరగుజ్జులకు పెన్షన్ మంజూరు విషయంలో వైద్య ధృవీకరణ పత్రాల జారీలో నిబంధనలు సడలించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం సెర్ప్ సీఇఓతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. కో-ఆప్షన్ సభ్యుడు షేక్ వౌలానా అబుల్ కలాం మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలను మన రాష్ట్రంలో కూడా కొనసాగించే విధంగా ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చాలని మంత్రి కామినేనికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి కామినేని మాట్లాడుతూ ఇప్పటికే అమరావతిలో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ఏరియా ఆస్పత్రిలో 14 వైద్య పోస్టులకు నలుగురు మాత్రమే పని చేస్తున్నారని, ఉన్నత విద్య కోసం కొందరు గైర్హాజరవుతున్నారన్నారు. ఫలితంగా వైద్యులు లేని దుస్థితిని ఏర్పడిందన్నారు. మంత్రి కామినేని మాట్లాడుతూ స్పెషలిస్టు వైద్యుల కొరతను త్వరలోనే తీరుస్తామన్నారు. విద్యా శాఖపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడుతూ అనేక పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని, కనీస వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇటీవల తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిందని, వాటి రక్షణకై పాఠశాలల్లో షెడ్లు నిర్మించాలని కోరారు. దాతల సహకారంతో సైకిల్ షెడ్ల నిర్మాణానికి కృషి చేయాలని మంత్రి దేవినేని సంబంధిత అధికారులకు సూచించారు. పలు శాఖల పనితీరుపై ఈ సమావేశంలో సభ్యులు కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, జెడ్పీ సిఇఓ కె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి వారం రోజులు మరుగుదొడ్ల నిర్వహణపై స్పెషల్ క్యాంపైన్
* టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, నవంబర్ 18: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వతేదీ నుండి 25వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల పాటు ప్రతి గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్ల వినియోగంపై అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. 19వతేదీన గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించటంతో పాటు ర్యాలీ నిర్వహించాలన్నారు. 20వతేదీన మండల విద్యాశాఖాధికారులు మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా గ్రామైక్య సంఘాలు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, ఎంపీఎంలు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. 21వతేదీన పాఠశాల విద్యార్థులచే చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. 22వతేదీన టాయిలెట్ క్లీనింగ్‌పై స్వయం సహాయక సంఘాలకు అవగాహనా కార్యక్రమాలు జరపాలన్నారు. 23వతేదీన మండల మహిళా సమాఖ్యలు, ఎంపీఎంలు, మండల స్థాయి వక్తృత్వ పోటీలు, 24న జిల్లా సమాఖ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. 25వతేదీన ముగింపు వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు.