కృష్ణ

పేదల పక్షపాతి ఇందిరమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, నవంబర్ 19: పేదల పక్షపాతి స్వర్గీయ ఇందిరమ్మ అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఇందిరమ్మ జయంతి కార్యక్రమాలను ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ బొర్రా కిరణ్, పిసిసి సభ్యులు కటారి ఉమామహేశ్వరరావులు పూలమాలులు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పధంలో ఇందిరమ్మ నడిపించారన్నారు. పేదల కోసం నిరంతరం పరితపించారన్నారు. బ్యాంకుల జాతీరుూకరణ ఆమె హయాంలో జరిగిందన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు పోతురాజు ఏసుదాసు, పి తిరుపతిరావు, ఇస్సాకు, వీరంకి శ్రీ్ధర్, గణపవరపు విష్ణువర్థనరావు, మేలిమి శివాంజనేయులు, అన్నవరపు దుర్గారావు, పిట్టల నాగేశ్వరరావు, రామకృష్ణ, మసనం సుధాకర్, బ్రహ్మయ్య, కోడిరెక్కల ప్రసాద్, వేముల శ్రీను, పొట్టిముత్యపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిన పొగమంచు
కూచిపూడి, నవంబర్ 19: మొవ్వ మండలంలో ఆదివారం పొగమంచు దట్టంగా అల్లుకుని రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించింది. ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంప్రదాయ వరి కోతలు మండలంలోని భట్లపెనుమర్రు పెడసనగల్లు, మొవ్వ, అయ్యంకి, మొవ్వపాలెం తదితర గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేవలం తేలికపాటి జల్లులకే పరిమితం కావటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఆకాశం మేఘావృతమైనా వరి కోతలు కోస్తున్నారు. పొగమంచు పడితే వర్షాలు తగ్గుతాయన్న పెద్దల సూచనలకు అనుగుణంగా వరి కోతలు ప్రారంభించారు.