కృష్ణ

పెదప్రోలులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, నవంబర్ 21: మండల పరిధిలోని పెదప్రోలు పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ అధ్యక్షుడు నాదెళ్ల శరత్ చంద్రబాబు మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా రూ.కోటి 25లక్షలు చొప్పున వ్యాపారం చేస్తూ రూ.5.5లక్షలు లాభాల్లో ఉందని సహకార సంఘం కార్యదర్శి యం దుర్గానాగేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పరుచూరి రాఘవేంద్రరావు, డైరెక్టర్ జన్యావుల రామ్మోహనరావు, సభ్యులు మట్టా తాతయ్య, మేకా వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

కన్నతండ్రినే కాలువలోకి నెట్టి హత్యచేసిన కొడుకు
విస్సన్నపేట, నవంబర్ 21: కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్న తండ్రినే ప్రవహిస్తున్న నాగార్జున సాగర్ కాలువలోకి నెట్టి హత్య చేసిన ప్రబుద్ధుడి ఉదంతమిది. మండలంలోని చండ్రుపట్ల శివారు చిన తండాకు చెందిన భాణావతు కపూరియా(60)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 12 ఎకరాల భూమిని పిల్లలందరికీ సమానంగా పంచిపెట్టాడు. పెద్ద కుమారుడు కృష్ణకు తండ్రి పంచిపెట్టిన పద్ధతి నచ్చలేదు. కొద్ది కాలంగా అతనిపై కోపంగా ఉంటున్నాడు. తమ గ్రామ సమీపంలోని జమలాపురం మేజరు వరకు కొడుకు కృష్ణ తండ్రికి మాయమాటలు చెప్పి తీసుకువచ్చాడు. అక్కడ తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగి కృష్ణ ఆవేశంతో కన్నతండ్రిని వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి నెట్టివేశాడు. చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్నవారు చూస్తుండగానే ఈసంఘటన జరిగింది. వారు వచ్చే లోపే కృష్ణ పారిపోయాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరుగగా సాయంత్రం 3 గంటల సమయంలో కపూరియా మృతదేహాన్ని పోలీస్‌సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంయక్తంగా బయటకు తీశారు. తిరువూరు సిఐ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు, శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.