కృష్ణ

ఆగస్టు లోపు పేటకు కృష్ణాజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, నవంబర్ 23: రాబోయే ఆగస్టు నాటికి జగ్గయ్యపేటకు కృష్ణా జలాలను తాగునీరుగా అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని, అందుకు ప్రతి గురువారం ఈ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. గురువారం కృష్ణాజలాల పనులపై ఆయన పరిశీలించి మెయిన్ వాటర్ వర్క్స్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై ఉన్న కృత నిశ్చయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణానికి తాగునీరు అందించేందుకు గానూ ప్రతి గురువారం ఈ పధకంపై సమీక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ వద్ద మరియు ముక్త్యాల వద్ద చేపట్టిన పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో పనుల్లో జాప్యం తగదని, లక్ష్యాలను నిర్దేసించుకొని ఆ మేరకు పనులు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ రమేష్, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, పబ్లిక్ హెల్త్ డిఇ శశిధర్, కౌన్సిల్ సభ్యులు, అలానే కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్థిక మంత్రిని కలసిన ఎయిడెడ్ కళాశాలల తాత్కాలిక ఉద్యోగులు
ఉయ్యూరు, నవంబర్ 23: ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా, అరకొర జీతాలతో జీవిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎయిడెడ్ కళాశాలల తాత్కాలిక ఉద్యోగులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి విజ్ఞప్తి చేసారు. గురువారం శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్‌తో పాటు యనమలను కలసిన ఉద్యోగుల సంఘం నాయకులు ఎయిడెడ్ కళాశాలలో 2003 నుంచి నియామక ప్రక్రియను నిలిపివేసారని, అప్పటికే ఉన్నవారు, ఐదేళ్ళ పైబడి తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి కనీసం ఉద్యోగ భద్రత కల్పించకుండా ఉపయోగించుకుంటున్నారని వారు వివరించారు. దీనిపై స్పందించిన యనమల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. రాజేంద్రతో మంత్రిని కలసిన వారిలో సంఘ నాయకులు కె రమేష్, పువ్వాడ పాండురంగారావు, ఎన్ వసంతరావు, వి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.