కృష్ణ

సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తికి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 23: గత ఆరు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురై తీవ్ర మనోవేదనతో బుధవారం తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న సీనియర్ సివిల్ జడ్జి పేరాబత్తిన వెంకట సదానందమూర్తి పార్థివ దేహాన్ని గురువారం ఆయన స్వస్థలమైన మచిలీపట్నం తీసుకువచ్చారు. భాస్కరపురంలోని ఆయన స్వగృహం వద్ద సదానందమూర్తి పార్థివ దేహాన్ని ఉంచారు. రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు, పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు జడ్జి సదానందమూర్తి పార్థివదేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న సదానందమూర్తి గత ఆరు నెలల క్రితం క్రమశిక్షణాపరమైన అంశాలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనతో ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం న్యాయశాఖకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సదానంద మూర్తి తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విజయవాడ నగరంలో మంచి పేరుగడించారు. చిన్నతనం నుండి తన తండ్రినే గురువుగా భావించి న్యాయవృత్తి పట్ల మక్కువ పెంచుకున్న సదానందమూర్తి న్యాయవాది నుండి న్యాయమూర్తిగా ఎంపికై విజయవాడ, మదనపల్లి, నెల్లూరు, తిరుపతి నగరాల్లో పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం.
కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ చదువుతోంది. కుమారుడు బెనారస్ (కాశి) యూనివర్సిటీలో ఐఐటీ చదువుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సదానందమూర్తికి భాస్కరపురంలోని త్రిశక్తి పీఠంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. స్థానికంగానే స్థిరపడాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే భాస్కరపురంలో నూతన భవంతిని నిర్మించుకున్నారు. మూర్తి అత్త గారి గ్రామమైన గూడూరు మండలం కప్పలదొడ్డిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సదానందమూర్తి మృతికి సంతాప సూచికంగా పట్టణంలోని న్యాయవాదులంతా తమ విధులను బహిష్కరించారు. ఆయన పార్థివదేహాన్ని చూసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు చలించిపోయారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావుతో పాటు పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు జయరాజు, మల్లిఖార్జునరావు, పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోగంటి సాయిమోహనరావు, సీనియర్ న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ, మహ్మద్ సులేమాన్, శింగలూరి శాంతి ప్రసాద్, పుప్పాల కామేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు సదానందమూర్తి పార్థివ దేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

శారీరక శ్రమతోనే ఆరోగ్యం
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 23: శారీరక శ్రమతోనే ఆరోగ్యం చేకూరుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణ ప్రధాన పార్కులో రూ.9లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ జిమ్ కేంద్రాన్ని గురువారం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కమిషనర్ జస్వంతరావు, కౌన్సిలర్ బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు.