కృష్ణ

ప్రైవేటు క్వారీ పేరుతో ఎస్సీ భూములల్లో ఇసుక తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 23: మండలంలోని రొయ్యూరులో నడుస్తున్న ప్రైవేటు క్వారీ ఎస్సీ సోసైటీ భూముల్లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, ఆ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని దళితులు డిమాండ్ చేశారు. గురవారం మాజీ సర్పంచ్ దాసరి సుందరకుమార్ ఆధ్వర్యంలో పామర్రు, పెనమలూరు నియోజకవర్గ దళిత ఐక్య వేదిక కన్వీనర్ పెనుమాల నాగకుమార్, పూలె, అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు పిల్లి గంగాధర్, బీఎస్‌పీ నాయకుడు పెగ్గెం ప్రసాద్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు లుక్కా పరుశురామయ్య, రాచూరి బాజి, లుక్కా రాంబాబు, బందెల కోటేశ్వరరావు,లుక్కా నాగకుమార్ పలువురు మహిళలు రొయ్యూరు క్వారీకి వెళ్ళే రహదారికి అడ్డంగా టెంట్‌వేసి ఇసుక లారీలను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. సుందర్‌కుమార్ మాట్లాడుతూ రొయ్యూరులో గత ఐదారు నెలలుగా ప్రభుత్వం ఉచిత ఇసుక క్వారీ నడపటంతో 800 మంది కార్మికులు జీవనోపాధి పొందారని అన్నారు. అయితే ఉచిత క్వారీని నిలిపివేసి కొందరు భూస్వాములకు ప్రైవేటు క్వారీని అధికారులు అక్రమంగా అనుమతిని ఇచ్చారని ఆరోపించారు. 2006 నుంచి 2011 మధ్య ఎన్ని ధర్నాలు చేసినా రొయ్యూరుకు ఇసుక క్వారీని మంజూరు చేయలేదన్నారు. అంతేకాక ఎస్సీ సొసైటీకి ఇచ్చిన ప్రభుత్వ భూములను రైతుల సొంత పట్టా భూములుగా చూపి ప్రైవేటు క్వారీకి అనుమతి ఇచ్చారని అన్నారు. మూడు మీటర్లకు మించి జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయని రైతులు సైతం ఆందోళన కొనసాగిస్తామని సుందర్‌కుమార్ పేర్కొన్నారు. రొయ్యూరు క్వారీ వద్ద ఎస్సీలు, బీసీలు నాయకులు ధర్నా చేయటంతో సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ ప్రసాద్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. క్వారీలో ఉదయం నుంచి లారీలు నిలిచి పోయాయయని, వాటిని బయటకు వెళ్లనీయాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులతో చర్చలు జరుపుకోవాలని సీఐ సూచించారు. దాంతో సాయంత్రానికి ధర్నా విరమించారు. ఈ విషయంపై తహశీల్దార్ జి భద్రును వివరణ కోరగా రికార్డుల ప్రకారమే రైతుల పట్టా భూముల్లో ప్రైవేటు ఇసుక క్వారీకి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ సోసైటీ భూములు ఇందులో లేవని తెలిపారు.