కృష్ణ

హైవేపై ధర్నా, స్టేషన్ వద్ద ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, నవంబరు 23: హనుమాన్ జంక్షన్ సమీపంలోని డెల్టా షుగర్స్ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం హనుమాన్ జంక్షన్‌లో ఆందోళన నిర్వహించారు. చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై ధర్నాచేస్తున్న వామపక్ష నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వీరవల్లి పోలీస్ స్టేషనుకు తరలించారు. దీంతో కార్యకర్తలు, రైతులు ఆగ్రహాంతో వీరవల్లి పోలీస్ స్టేషను ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డెల్టాషుగర్స్‌లో 2017-18 సీజనుగాను చెరకు క్రషింగ్ చేయాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ కూడలిలో రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షులు కేశవరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, చెరకు రైతు సంఘం నాయకులు మాగంటి హరిబాబు, సీఐటియూ జిల్లా కార్యదర్శి వై నరసింహారావు, స్థానిక నాయకులు ధర్నాకు దిగారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకోని ధర్నాచేస్తున్న నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టుచేసి వీరవల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతుల కోసం పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టు చేయడంపై వామపక్షాల కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వీరవల్లి పొలీస్ స్టేషను వద్ద బైఠాయించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టుచేయడం అన్యాయమని, పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవిగా వున్నాయని వామపక్షనాయకులు ఆరోపించారు. చెరకు రైతులకు అన్యాయం చేస్తూన్న ప్రభుత్వం తగినమూల్యం చెల్లించకతప్పదని, గన్నవరం శాసనసభ్యుడు వంశీమోహన్‌కు చిత్తశుద్ధి వుంటే రైతుల పక్షాన పోరాటం చేయాలని కేశవరావు డిమాండ్ చేశారు. రైతుల ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న చంద్రబాబు చెరకురైతులను ఆదుకోవాలని కోరారు. డెల్టా షుగర్స్‌ను ఫ్యాక్టరీలోనే ఏడాది చెరకుక్రషింగ్ చేసేలా చర్యలుతీసుకోవాలని నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపుపాడు మండల వామపక్షాల నాయకులు అబ్దుల్ బారీ, నల్లి అంజనేయులు, బేతాళ శ్రీనివాసరావు, ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.