కృష్ణ

సీఎం హెచ్చరికలు బేఖాతర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు నిర్ణయించడంతో పాటు అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించినా అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్రమ ఇసుక రవాణాలో తమ పార్టీ నేతలతో సహా రాజకీయ పార్టీల జోక్యం సహించబోమని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా స్పష్టం చేసినప్పటికీ ఆచరణలో ఆయన ఆదేశాలు అమలవుతున్న దాఖలాలు కానరావటం లేదు. మాటలకు, చేతలకు పొంతన లేదనే విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు న్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు రీచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించి అక్కడ నుండి భవన, ఇతర నిర్మాణదారులకు ఇసుక రవాణా చేసుకునే అవకాశం కల్పించింది. ఇసుక అవసరాలను గుర్తించిన అక్రమార్కులు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఇటీవలి కాలం వరకూ అధికారికంగా నడిచిన రావిరాల, వేదాద్రి ఇసుక క్వారీని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రావిరాల క్వారీ నుండి రాత్రులు, తెల్లవారుఝాము సమయాల్లో పెద్దఎత్తున ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా సమీప తెలంగాణ జిల్లాలకు తరలివెళుతోందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం అక్రమ రవాణాకు సానుకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తవౌతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టణానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు సమీపంలోని సిమెంట్ కర్మాగారంలో నిర్మాణాల కోసం పెద్దఎత్తున ఇసుక సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకొని భారీగా ఆదాయం పొందుతున్నట్లు ప్రజలు, ప్రతిపక్ష వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటీవల మండల స్థాయి వైకాపా నాయకునికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని ఓల్టా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా అక్రమ వ్యాపారం చేస్తున్నా వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సిఐ లచ్చునాయుడు, జగ్గయ్యపేట, చిల్లకల్లు ఎస్‌ఐలు ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించి అక్రమ ఇసుక రవాణాపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆగలేదు. రావిరాల క్వారీతో పాటు బూదవాడ, కె అగ్రహారం, తక్కెళ్లపాడు, బలుసుపాడు, తదితర ప్రాంతాల్లో పాలేటి నుండి ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా అధికారులకు కనబడకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని అనుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈప్రాంత ప్రజానీకం కోరుతున్నారు.