కృష్ణ

అమరావతి కోసం ఆత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అమరావతి నగర నిర్మాణంపై ప్రపంచం మొత్తం ఆశగా ఎదురు చూస్తోందని ఎక్సైజ్, బిసి వెల్ఫేర్ సంక్షేమ, హ్యాండ్లూం శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ పలు అంశాలు పరిశీలించారు. దుబాయికి చెందిన తెలుగు సంస్థ ముసఫ్ఫా ఆహ్వానం మేరకు కొల్లు రవీంద్ర దుబాయ్ వెళ్లారు. అక్కడ పల కంపెనీల ప్రతినిధులను కలిశారు. టూరిజం, మెరైన్ ఫ్యాక్టరీలు, సముద్ర సంబంధ ఉత్పత్తుల తీరు పరిశీలించారు. విదేశాలకు చెందిన పలు కన్సల్టెన్సీలను సంప్రదించి టూరిజం, మెరైన్ ఉత్పత్తులపై వివరాలు సేకరించారు. పర్యటన ముగించుకుని మంగళవారం విజయవాడ చేరుకున్న ఆయన పలు అంశాలు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 9 వందల కిలోమీటర్లకు పైగా ఉన్న తీర ప్రాంతం రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించబోతోందని వివరించారు. కావాల్సినంత జల వనరులు ఉన్న మన రాష్ట్రం మత్స్య వాణిజ్యానికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్రంలో టూరిజానికి మంచి రోజులు
రాష్ట్రంలో టూరిజానికి మంచి రోజులు వచ్చాయని కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో టూరిజంపై దృష్టి పెట్టారని అన్నారు. కొంపల్లి ఖిల్లా మొదలుకుని సముద్ర తీర ప్రాంతాలను. నదీ పరీవాహక ప్రాంతాలను టూరిజం హబ్‌గా మారుస్తున్నామని వివరించారు.