కృష్ణ

బలపడిన టీమ్-కృష్ణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 10: టీమ్ కృష్ణా బలపడింది. మొన్నటి వరకు కీలక శాఖలకు అధిపతులు లేని కారణంగా పాలనాపరమైన అంశాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న కృష్ణాజిల్లా ప్రస్తుతం పూర్తి స్థాయి అధికార యంత్రాంగంతో ముందుకు సాగుతోంది. పలు శాఖలకు ఇన్‌ఛార్జ్‌ల స్థానంలో పూర్తి స్థాయి అధికారులు వచ్చారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ చైర్మన్ పోస్టుతో పాటు జిల్లా పంచాయతీ అధికారి పోస్టు మాత్రమే జిల్లాలో భర్తీ కావల్సి ఉంది. మిగిలిన అన్ని శాఖలకు పూర్తి స్థాయి అధికారుల నియామకం జరిగింది. కలెక్టర్ బి లక్ష్మీకాంతం కృషి ఫలితంగా నిన్న మొన్నటి వరకు ఇన్‌ఛార్జ్‌ల బందీఖానాలో ఉన్న జిల్లాకు విముక్తి లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌ఛార్జ్‌ల స్థానంలో రెగ్యులర్ అధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదే క్రమంలో జిల్లాలో పలు శాఖలకు పూర్తి స్థాయి అధికారులు లేకపోవటంతో కలెక్టర్ చేసిన సిఫార్సులకు ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క పోస్టును భర్తీ చేసుకుంటూ వచ్చింది. రెండు నెలల క్రితం జిల్లాలో సుమారు పది శాఖలకు పూర్తి స్థాయి అధికారులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలనాపరమైన అంశాల్లో జిల్లా యంత్రాంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. అధికారుల కొరత ఉన్నప్పటికీ కలెక్టర్ బి లక్ష్మీకాంతం నేతృత్వంలో సంక్షేమ పథకాల అమలులో అనేక పర్యాయాలు జిల్లా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిందన్నారు. ఈ-ఆఫీస్, ఈ-పోస్, రేషన్, పెన్షన్ పంపిణీ, మీకోసం అర్జీలు తదితర అంశాల్లో జిల్లా ప్రగతి కనబరుస్తూ వచ్చింది. ప్రస్తుతం దాదాపు అన్ని శాఖలకు పూర్తి స్థాయి అధికారులు నియమితులు కావటంతో పాలనలో మరింత వేగం పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.