కృష్ణ

నకిలీ విత్తన బాధిత రైతుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, డిసెంబర్ 11: నకిలీ మిర్చి విత్తనాలు నాటి పంట నష్టపోయిన గిరిజన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరెడ్డి, పివి ఆంజనేయులు మాట్లాడుతూ ఎ కొండూరు తండాకు చెందిన గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో ఓంకార్ సీడ్స్‌కు చెందిన మిర్చి విత్తనాలను హైబ్రిడ్ సీడ్స్ షాపులో కోనుగోలుచేసి పంట సాగుచేసినట్లు తెలిపారు. సాగుచేసిన ఐదు నెలలకు కూడా పూత రాకపోవడంతో సాగుచేసిన రైతులు విత్తనాలు నకిలీవి అనితెలిసి షాపు యజమానికి చెప్పినా పట్టించుకోలేదని వారు అన్నారు. ఇప్పటికైన షాపు యజమానిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయంలో అందచేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా మైలవరం సిఐ పి రామచంద్రరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు విత్తనాలు కోనుగోలు చేసిన సమయంలో ఇన్సూరెన్స్ చేసివుంటే పరిహారం ఇప్పటికే అందేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ జె వెంకటరమణ, ఎస్ రామకృష్ణారెడ్డి, జట్టి వెంకటేశ్వరరావు, బి గోపిరాజు, డి రాముడు, ఎం రామారావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేద్దాం
జగ్గయ్యపేట, డిసెంబర్ 11: తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పి తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పేలా తెలంగాణాలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేద్దామని వక్తలు పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ తెలుగుమహాసభల నిర్వహణ సందర్భంగా సన్నాహక సదస్సుకు సమన్వయకర్త సుశర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగుభాష ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలను కళలకు కాచాని అయిన జగ్గయ్యపేటకు చెందిన తెలుగు భాషా పండితులు, తెలుగు కవులు, అభిమానులు, కళాకారులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య శెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లతామంగతాయారు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ సర్వా చిదంబర శాస్ర్తీ, జీవీడి ప్రసాదరావు, దోసపాటి నాగేశ్వరరావు తదితర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.