కృష్ణ

ఇదేనా మీ పనితీరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 11: ఇదేనా మీ పని తీరు.. ఇలా అయితే ఎలా.. ఇకపై సహించేది లేదు. పనితీరు మెరుగుపర్చుకోని పక్షంలో చర్యలకు నేను సిద్ధం.. ఆ తర్వాత మీ ఇష్టం.. అని పలు ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో కలెక్టర్ లక్ష్మీకాంతం శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. ప్రధానంగా స్ర్తి శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణ సంస్థల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఘాటైన హెచ్చరికలు చేశారు. ఆయా శాఖల్లో పథకాల అమలు తీరుతెన్నుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పక్క జిల్లాను అన్నింటా ముందు నిలిపేందుకు తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తుంటే కొంత మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను కూడా సక్రమంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు తెలియచేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. పంచాయతీ రాజ్, మత్స్య శాఖాధికారులు కూడా పనితీరు మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రైమరీ సెక్టారులో అద్భుతమైన విజయాలను జిల్లా నమోదు చేసుకుంటుందన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో నాలుగు శాతం పురుగుల మందుల వాడకం తగ్గగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 22 శాతం తగ్గిందన్నారు. 52వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగాన్ని తగ్గించి దేశంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఫలితంగా దిగుబడులు గణనీయంగా పెరిగి జిల్లా తలసరి ఆదాయం పెంపునకు దోహదకారిగా మారిందన్నారు. ముందస్తు సాగు వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. పంట రుణాల విషయంలో జిల్లా కొంత మేర వెనుకబడిందన్నారు. 3వేల 500 కోట్లు రుణ మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే మంజూరు చేశారని, నూరు శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం లేబర్ కాంపోనెంట్ పెంచేందుకు అన్ని మండల కేంద్రాల్లో పల్లెవనం కార్యక్రమాన్ని చేపట్టాలని డ్వామా అధికారులకు సూచించారు. మరో 15 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఫిర్యాదులపై తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏ ఒక్క ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వేషన్ల ప్రకారమే బ్యాక్‌లాగ్, కారుణ్య నియామకాలు జరగాలన్నారు. ఔట్ సోర్సింగ్‌లో కూడా రిజర్వేషన్లు పాటించాలన్నారు. జిల్లాలో ఉన్న విభిన్నప్రతిభావంతులందరికీ పక్కా గృహాలు, రేషన్, పెన్షన్‌తో పాటు ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ఈ నెల 19వతేదీ నుండి వారం రోజుల పాటు ఆత్మగౌరవ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ప్రత్యేక డ్రస్ కోడ్ ద్వారా ర్యాలీలు, ప్రతిజ్ఞలు నిర్వహించాలన్నారు. జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాజాతాలు ప్రదర్శించాలన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నివాసం ఏర్పాటు చేసుకోని అధికారుల జాబితాను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, డీఆర్‌డీఎ చంద్రశేఖరరాజు, డీసీఓ ఆనందబాబు, జెడ్పీ సీఇఓ కె శ్రీదేవి, మత్స్య శాఖ జెడీ యాకుబ్ బాషా, సీపీఓ వెంకటేశ్వరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఓపెన్ చెస్ పోటీలు
గుడివాడ, డిసెంబర్ 11: గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ ఓపెన్ చెస్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో జీ విజయరాజు, ఎం నరసింహారావు, కే నాగార్జునరెడ్డి, జూనియర్స్ విభాగంలో జే రాజాసూర్య, యూసఫ్జ్ర, ఎన్ సాయి విజయ్‌లు విజేతలుగా నిలిచారు. వీరికి స్టేడియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బొగ్గరపు తిరుపతయ్య, కిలారపు రంగప్రసాద్‌లు బహుమతులను అందజేశారు.

పర్యాటక కేంద్రంగా లైట్‌హౌస్

* నాగాయలంక మండలం గుల్లలమోదలో ఉప సభాపతి మండలి
నాగాయలంక, డిసెంబర్ 11: మండల పరిధిలోని గుల్లలమోద సమీపంలోని నాగాయలంక లైట్‌హౌస్ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోనున్నట్లు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం దివిసీమకు చెందిన పాత్రికేయుల బృందం, పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఓ ప్రత్యేక పంటు ద్వారా తొలుతగా ఎదురుమొండి ద్వీపంలోని వ్యవసాయాభివృద్ధిపై సమీక్షించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
ఈ పర్యటనలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, నాగాయలంక ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు డా. మోకా బుచ్చిబాబు, బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, ఎఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎదురుమొండి సర్పంచ్ ఎన్ బాబూరావు పాల్గొన్నారు.