కృష్ణ

మత్స్య పరిశ్రమతో ఆర్థిక స్వావలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, డిసెంబర్ 12: మత్స్య పరిశ్రమ ద్వారా తీర ప్రాంతాలలో నివశిస్తున్న మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని భావదేవరపల్లిలోని మండల వెంకట కృష్ణారావు పిషరీష్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నాలుగు రోజులు పాటు జరిగే మత్స్యకార మహిళలు, డ్వాక్రా మహిళల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కుటుంబ వ్యవస్థలో భర్తతో పాటు భార్య కూడా ఆర్థిక అభివృద్ధి కోసం ఇటువంటి వాటిని చేపట్టటం ద్వారా మిక్కిలి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మత్స్య సంపదకు రాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలో సైతం గిరాకీ ఉందన్నారు. దీనిని బట్టి ఈ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. జనవరి 13, 14 తేదీలలో నాగాయలంకలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పడవల పోటీల సందర్భంగా మహిళలు తాము సేకరించిన మత్స్య ఉత్పత్తులను ఈ పోటీలకు హాజరయ్యే వారికి విక్రయించటం ద్వారా అధిక లాభాలను పొందవచ్చునన్నారు. జిల్లాలో మత్స్య ఉత్పత్తులకు దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాలు నెలవుగా ఉన్నాయని, వీటి ప్రాధాన్యతను గుర్తించి మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధిని సాధించాలని బుద్ధప్రసాద్ కోరారు. తొలుత కళాశాలలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ వంటకాలను పరిశీలించారు. అనంతరం మత్స్య శిక్షణ కార్యక్రమాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మహిళల్లో మత్స్య ఉత్పత్తుల ద్వారా చేకూరు ప్రయోజనాలను వివరించారు. ఈనెల 15వ తేదీ వరకు చేపలతో తయారు చేసిన వివిధ వంటకాలను శిక్షణలో ప్రదర్శిస్తామని తెలిపారు. శిక్షణలో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు రోజుకు 30 మంది పాల్గొంటారని వెల్లడించారు. అవనిగడ్డ మత్స్య శాఖ సహాయ సంచాలకులు టి సురేష్, కాకినాడ మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు మాధవీలత మహిళలకు శిక్షణ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ కెఎస్ కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు డా. మోకా బుచ్చిబాబు, భావదేవరపల్లి మాజీ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ సాంబశివరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.