కృష్ణ

బందరు పోర్టే అభివృద్ధికి దశ, దిశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 12: బందరు ప్రాంత అభివృద్ధికి దశ, దిశ పోర్టు ఒక్కటేనని అది రైతుల సహకారంతోనే సాధ్యమని రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. పోర్టు భూముల సమీకరణ అంశంపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం గ్రామ రైతులతో వారు సమావేశమయ్యారు. భూసమీకరణ పట్ల వారిలో నెలకొన్న అనుమానాలు, సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావులు మాట్లాడుతూ చిరకాల స్వప్నం నెరవేరాలంటే రైతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూసమీకరణ ద్వారానైనా, భూ సేకరణ ద్వారానైనా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూములు ఇచ్చే రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూరాలంటే భూసమీకరణ ఒక్కటే మార్గమన్నారు. భూసేకరణ వల్ల తాత్కాలిక ప్రయోజనం తప్ప మరొకటి ఉండదన్నారు. భూసేకరణ ద్వారా ఎకరానికి రూ.15 నుండి రూ.20లక్షల మేరకు పరిహారం అందే అవకాశం ఉందన్నారు. అదే భూసమీకరణలో అయితే మెగా టౌన్‌షిప్‌లో ఇచ్చే 1250 చదరపు గజాల స్థలం విలువ రూ.60లక్షల నుండి కోటి రూపాయల పలికే అవకాశం ఉందన్నారు. రైతులు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రావాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే పోర్టు భూముల విషయంలో ల్యాండ్‌పూలింగ్‌ను తెర మీదకు తెచ్చామన్నారు. ప్రభుత్వం దగ్గర తగినంత నిధుల వెసులుబాటు ఉంటే ఈ పాటికి పోర్టు పనులు ప్రారంభమై ఉండేవన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు గమనించాలని కోరారు. మాగాణి, మెట్ట భూముల విషయంలో త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ఇందు కోసం వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ, రెవెన్యూ, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ త్వరలో గ్రామాల్లో పర్యటించి మెట్ట, మాగాణి భూములపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. ఈ నివేదిక అందిన వెంటనే మెట్ట భూములను మాగాణి భూములుగా మార్పు చేసి ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు గాను మెగా టౌన్ షిప్‌ను నిర్మించి ఫ్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. అయితే రైతుల సహకారం కొంత కొరవడిన నేపథ్యంలో విడతల వారీగా టౌన్ షిప్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. చిలకలపూడి రైల్వే స్టేషన్ నుండి తాళ్లపాలెం వరకు మంగినపూడి బీచ్ రోడ్డుకు ఎడమ చేతి వైపు మెగా టౌన్ షిప్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎడమ చేతి వైపు ఉన్న మేకావానిపాలెం, గోపువానిపాలెం, తవిసిపూడి, కరగ్రహారం గ్రామాల్లో పోర్టు నిర్మాణం ఉంటుందన్నారు. కాలేఖాన్‌పేట, శివగంగ ప్రాంతాల్లో కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో జె ఉదయభాస్కరరావు, ముడ డెప్యూటీ కలెక్టర్లు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.