కృష్ణ

తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, డిసెంబర్ 14: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావుపేర్కొన్నారు. మండలంలోని కాట్రేనిపాడు గ్రామంలో బుధవారం రాత్రి పలెనిద్ర, రచ్చబండ కార్యక్రమం వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ పంచాయితీ పరిధిలోని కాట్రేనిపాడు, హరిచ్చంద్రపురం, రామచంద్రాపురం, నార్త్ హరిజనవాడల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని భావించిన నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అర్హులకు అన్యాయం జరుగుతుందని, పచ్చ చొక్కాలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. అలాగే రాజధాని నిర్మాణం పేరుతో ఉన్న ధనాన్ని వృద్దా చేయడం తప్ప రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్నది శూన్యమని అన్నారు. గృహాలు నిర్మిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు గృహాలు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించకపోవడంతో గృహాలు నిర్మించుకున్న వారు అప్పులో ఊబీలో కూరుకుపోయారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి పార్టీతో సంబంధం లేకుండా అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంగా వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ మూల్పూరి నాగవల్లేశ్వరరావు, పార్టీ సర్పంచ్‌లు రేగుల గోపాలకృష్ణ, నాగుల శ్రీనివాసరావు, పల్లెపాము కుటుంబరావు, యాకోబు, మేరుగు తేరేజమ్మ, నందిగం శ్రీనివాసరావు, జలగం పద్మజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.