కృష్ణ

నేడు ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 14: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి లక్ష్మికాంతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించుకోవచ్చన్నారు. జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈనెల 31వతేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. సెలవు దినాలైన ఈ నెల 17, 24తేదీల్లో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తామన్నారు. 2018 జనవరి 1వతేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు కావచ్చన్నారు. జనవరి 10వతేదీన అభ్యంతరాలు పరిష్కరించి 20వతేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

దివిసీమలో వరికోతలు ముమ్మరం
నాగాయలంక, డిసెంబర్ 14: దివిసీమలోని వివిధ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నా యి. ఈ సంవత్సరం పట్టిసీమ పుణ్యమాని ఈ ప్రాంత రైతులు నూటికి నూరుశాతం తమ భూములను సాగుచేసుకున్నారు. పులిగడ్డ క్యాంప్‌బెల్ ఆక్విడక్టు పరీవాహక ప్రాంతంలోని తూర్పు, దక్షిణ ప్రధాన పంట కాలువల ద్వారా సుమారు 50వేల హెక్టార్లలో సార్వా సాగు జరిగింది.
ఈ ఏడాది సంపూర్ణ స్థాయిలో సార్వా సాగుకు సాగునీరు విడుదల కావటం, వర్షాలు కూడా పడటం వంటి కారణాల వల్ల దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కొంత మంది రైతులు సంప్రదాయబద్ధంగా వరి కోతలు కోస్తుండగా, మరి కొంత మంది రైతులు ఆధునిక యంత్రాలతో వరికోతలు కోయిస్తున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లు స్వాధీనం
కూచిపూడి, డిసెంబర్ 14: మొవ్వ మండలంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు తాము కృషి చేస్తున్నామని కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ పేర్కొన్నారు. గురువారం కృష్ణానది నుండి ఒక గంటలో అక్రమంగా రవాణా అవుతున్న 15 ట్రాక్టర్లను ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపులోడ్‌తో ఉన్న ట్రాక్టర్లు, డ్రైవింగ్ లైసెన్సులు లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీ వెంకటేశ్వరరావు, పీసీలు పాల్గొన్నారు.