కృష్ణ

టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 15: ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తా సైనికునిలా పనిచేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చడం జరిగిందన్నారు. త్వరలోనే బందరు ఓడరేవు నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), టీడీపీ సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 15: బందరు డివిజన్‌లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలు దరఖాస్తుదారులు హాజరయ్యారు. ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె కృష్ణకుమారి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. లక్ష్మీబాల ఇంటర్వ్యూలు నిర్వహించారు. బందరు డివిజన్‌లో ఖాళీగా ఆరు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు 56 మంది, 56 సహాయకురాలి పోస్టులకు 111 మంది, మూడు మినీ అంగన్‌వాడీల కార్యకర్తల పోస్టులకు ఇరువురు దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు పీడీ కృష్ణకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలు జయలక్ష్మి, గాయత్రి, పద్మావతి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

ద్వాళాసాగుకు సన్నాహాలు
తోట్లవల్లూరు, డిసెంబర్ 15: తోట్లవల్లూరు మండలంలో రబీ సీజన్‌లో ద్వాళా వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం దాళ్వా వరిసాగు చేయవద్దని ఆరుతడి పంటలను సాగుచేయాలని ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయశాఖ అధికారులకు కూడా దాళ్వావరి వద్దని రైతాంగాన్ని కోరారు.
సాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని, దాళ్వావరికి సాగునీరివ్వటం కుదరదని అధికారులు ప్రకటించారు. బోర్లకింద రైతులు కూడా సాగుచేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికి పలు గ్రామాల్లో రైతులు దాళ్వా వరిసాగుకు మొగ్గు చూపుతున్నారు. వల్లూరుపాలెంలో వందల ఎకరాల్లో దాళ్వా వరిసాగుకు రైతులు నారుమడులు సిద్ధం చేస్తున్నారు. తోట్లవల్లూరు, యాకమూరు తదితర గ్రామాల్లో దాళ్వాసాగుకు రైతులు పొలాలను తయారు చేస్తున్నారు. గతేడాది రెండోపంటగా వేసిన మినుముకి తలమాడు తెగులు సోకి భారీగా నష్టపోయామని, అందువల్ల దాళ్వా వరిని సాగుచేయటానికి సిద్ధమవుతున్నామని రైతులు చెప్పారు. కొందరు మొక్కజొన్న పంటను సాగుచేసేందుకు విత్తులు నాటారు.