కృష్ణ

మూగబోయన విపక్షాల నోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గట్కరీతో సమావేశమై పోలవరం నిర్మాణంపై అపోహలు, సందేహాలు నివృత్తి చేసుకుని ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ తీసుకుని నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ పొందటంతో విపక్షాల నోళ్ళు మూగబోయాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టీకరించారు. శుక్రవారం రాత్రి మైలవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో మంత్రి ఉమ బిజీ, బిజీగా గడిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం విషయంలో నిన్నటి వరకూ విపక్షాలు అర్థంలేని ఆరోపణలు, అవాకులు, చవాకులు మాట్లాడాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీతో సమావేశమై పూర్తి విషయాలు వివరించిన అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించటంతోపాటు తక్షణమే నిధుల మంజూరుకు అంగీకరించారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పోలవరం నిర్మాణం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణాగోదావరి నదుల అనుసంధానంతో తాము సాధించిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దాని స్ఫూర్తితోనే గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఇది మరో అద్భుత ఘట్టం కానుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి ఏడాదిలోగా ఈప్రాంతానికి సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి తాను 49 సార్లు పోలవరం పర్యటించినట్లు తెలిపారు. ఈనెల 22న నితిన్ గడ్కరీ పోలవరం రానున్నట్లు తెలిపారు. ఆ యన పర్యటనతో పోలవరం నిర్మాణం మరింత వగవంతం కానుందన్నారు. అనుకున్న సమయానికి
దీని నిర్మాణం పూర్తిచేసి విమర్శకులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉమతోపాటు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, జడ్పీటిసి దొండపాటి రాము, సర్పంచ్ నందేటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ షహానాబేగం, వార్డు మెంబర్లు, ఎంపిటిసి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.