కృష్ణ

‘త్రిశూల వ్యూహాన్ని’ పకడ్బందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 15: పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘త్రిశూల వ్యూహం’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యా శాఖ కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక బాలాజీ విద్యాలయంలో బందరు డివిజన్ స్థాయి మండల విద్యా శాఖాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాల సాధనకు తీసుకోవల్సిన చర్యలను ఆర్‌జెడీ దేవానందరెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మండల విద్యా శాఖాధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌జెడీ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించి ఆ లక్ష్యసాధన వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాల కోసం ప్రవేశ పెట్టిన ‘త్రిశూల వ్యూహం’ విధానంతో సత్ఫలితాలను అందుకోవాలన్నారు. ఈ విధానం కింద ఇప్పటికే గ్యారంటీ పాస్, గ్యారంటీ ఫెయిల్డ్, గ్యారంటీ డిఫికల్ట్ విద్యార్థులను గుర్తించామన్నారు. బందరు డివిజన్‌లో మొత్తం 6వేల 860 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో 5వేల 648 మంది విద్యార్థులు గ్యారంటీ పాస్‌గా గుర్తించడం జరిగిందన్నారు. 695 మంది విద్యార్థులకు 10/10 జీపీఎ వస్తుందని అంచనా వేశామన్నారు. 828 మంది విద్యార్థులు గ్యారంటీ ఫెయిల్డ్‌గా గుర్తించినట్లు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సంక్రాంతి పండుగ అనంతరం అదనపు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు సైతం బోధనా సామర్థ్యాన్ని పెంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వీకారం కింద ఇప్పటికే బందరు డివిజన్‌లో రూ.36లక్షల మేర ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి, వౌలిక వసతులను దాతల సహకారంతో కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బందరు డీవైఇఓ చిట్టిబాబు, పలు మండలాల విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.