కృష్ణ

డ్రైయిన్ టు డ్రైయిన్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 28: సైడ్ డ్రైయిన్ల నిర్మాణం చేపట్టిన రోడ్లను డ్రైయిన్ టు డ్రైయిన్ నిర్మాణాలు చేపట్టాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరీపేట తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న సైడ్ డ్రైయిన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎవిఎస్ రెడ్డి రోడ్డులో నిర్మిస్తున్న డ్రైయిన్ నిర్మాణ పనులను పరిశీలించిన వీరపాండియన్ పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను గుర్తించి రోడ్డు పనులను తక్షణమే చేపట్టాలని, డ్రైయిన్ టు డ్రైయిన్ వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టి మెరుగైన వసతిని అందుబాటులోకి తేవాలన్నారు. రాధానగర్ 80 అడుగుల రోడ్డులో తక్షణమే కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. న్యూ రాజరాజేశ్వరీ పేటలోని విఎంసి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రస్తుత వేసవిలో ముఖ్య అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. వైద్యసేవల్లో ఎటువంటి అలక్ష్యం వహించకుండా మెరుగైన సేవలందించాలని సూచించారు. ఇందిరానాయక్ నగర్, డాబాకొట్ల సెంటర్, నందమూరి నగర్, తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి మార్టుగేజ్ ఆమోదం కొరకు వచ్చిన అర్జీలకు చెందిన భవనాల కొలతలను పరిశీలించిన కమిషనర్ వీరపాండియన్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంజి రోడ్డు, గుల్జార్ మార్గ్, మధర్ థెరీసా జంక్షన్, పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డు, క్రీస్తురాజుపురం, గురునానక్ రోడ్డు, బృందావన్ కాలనీ, తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మురళీ ఫార్చూన్ హోటల్ వద్ద రోడ్డుపై నీరు నిల్వ ఉంచడాన్ని పరిశీలించిన తక్షణమే నీటిని తొలగించాలన్నారు. గుల్జార్ మార్గ్‌లో చేపట్టిన డ్రైయిన్ డీ సిల్టింగ్ పనుల్లో భాగంగా తొలగించిన సిల్ట్‌న్ రోడ్డుపైనే కుప్పలుగా వేయడాన్ని గుర్తించిన కమిషనర్ అపరిశుభ్రత తాండవించే ఇటువంటి చర్యలు చేపట్టవద్దని, తక్షణమే పూడిక తీతను తొలగించాలన్నారు. సిద్దార్ధ పబ్లిక్ స్కూల్ రోడ్డులో చెత్త ఇతర వ్యర్థాలు ఉండుట గమనించి పారిశుద్ధ్య పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధార రహదారులతోపాటు అంతర్గత రోడ్లపై కూడా మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోబడునని ఆయన హెచ్చరించారు. గురునానక్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన తక్షణమే ఆయా గృహాల యజమానులతో చర్చించి వారికి టిడిఆర్ బాండ్లను ఇచ్చి విస్తరణకు అవసరమైన భూమిని సేకరించాలన్నారు. బృందావన్ కాలనీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయినప్పటికీ స్థానిక నివాసులు వారి ఇళ్లకు ప్రహరీ గోడ నిర్మించకపోవడంపై వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు తమ గోడలను నిర్మించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సూరజ్, ఇఇ ధనుంజయ, పివికె భాస్కర్ పాల్గొన్నారు.