కృష్ణ

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 17: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ ఎన్నికలలో వామపక్ష కూటమి విజయకేతనం ఎగురవేసింది. 15ఏళ్ల తరువాత బ్యాంకు పాలక పగ్గాలు చేపట్టిన వామపక్ష కూటమి వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్ పాలన సాగించిన ఈశ్వర్ ప్యానల్‌కు చెక్ పెట్టడం రికార్డనే చెప్పాలి. నాలుగోసారి కూడా ఈశ్వర్ ప్యానలే గెలుస్తుందంటూ పెద్దఎత్తున జరిగిన ప్రచారానికి స్వస్తి చెబుతూ బ్యాంకు ఓటర్లు ఊహించని విజయాన్ని అందించడం గమనార్హమనే చెప్పాలి. సీఐటీయూ, ఎఐటీయూసీ బలపర్చిన ప్రోగ్రెసీవ్ ఫ్రంట్‌కు ఆరుగురు డైరెక్టర్లు గెలుపొందగా ఐఎన్‌టీయుసీ, టీఎన్‌టీయుసీ బలపర్చిన ఈశ్వర్ ప్యానల్‌కు మిగిలిన ఐదుగురు డైరెక్టర్లకే పరిమితమైనారు. 15ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా బ్యాంకు పాలన సాగించిన ఈశ్వర్ ప్యానల్ ప్రస్తుత ఎన్నికల్లో కూడా విజయం సాధించి నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో, ప్యానల్‌కు సారథ్యం వహించిన డీ ఈశ్వర్ ఎవ్వరూ ఊహించని విధంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్‌టీయుసీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్‌టీయుసీని కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగారు. ఈ 2 యూనియన్లతోపాటు పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈశ్వర్‌కు బహిరంగంగానే మద్దతిచ్చాయి. రాష్ట్రంలో అధికార, విపక్షంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకూ ఎక్కడా, ఏ స్థాయి ఎన్నికలలోనైనా పొత్తు పెట్టుకోని టీఎన్‌టీయుసీ, ఐఎన్‌టీయుసీ యూనియన్ల కలయక అంతగా కలిసిరాలేదన్న విషయం తెలంగాణ సింగరేణీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలలో తేలిపోగా మళ్లీ ఆంధ్రాలో కూడా పునరావృతమవడం గమనార్హం. టీడీపీ రాజకీయ పలుకుబడితో వీఎంసీ బ్యాంకు ఎన్నికలలో గెలుపు నల్లేరుపై నడకే అంటూ ఊహించుకున్న ఇరు యూనియన్ల నేతలకు ప్రస్తుత ఫలితాలు ఆశాభంగానే్న మిగల్చగా టీడీపీకి గుణపాఠమంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా అనూహ్యరీతిలో గెలుపొందిన ప్రోగ్రెసివ్ ప్యానల్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి అయిన ప్రభావతి వేజేండ్ల పోటీచేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకూ జరిగిన బ్యాంకు పాలక మండలిలో మహిళలకు అంతగా ప్రాముఖ్యత ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే ప్రభావతిని ఎన్నికల బరిలోకి తీసుకొచ్చి ప్రోగ్రెసివ్ ప్యానల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలపడమే కాకుండా ఆమెతోపాటు ప్యానల్ గెలుపునకు తెరవెనుక కృషి చేసిన రాష్ట్ర ఒలంపిక్ సంఘ కార్యదర్శి రావ్ పన్నిన వ్యూహాలు ఫలించాయన్నది సుస్పష్టం.
ప్రస్తుత ఓటమి కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయుసీకి అంతగా నష్టం లేకున్నా అధికార టీడీపీకి చెందిన టీఎన్‌టీయుసీ ప్రాబల్యానికి కొంత నష్టమన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో వైరుధ్యంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీ యూనియన్ల కలయక అనైతికమని, కేవలం బ్యాంకు పాలక మండలిని కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతోనే, ఈ కూటమి ఎన్నికల్లో పోటీచేశాయంటూ వినిపించిన వాదనలు ప్రోగెసీవ్ ఫ్రంట్‌కు కలిసొచ్చింది. ఇదిలావుండగా జరిగేవి చిన్న స్థాయి బ్యాంకు పాలక మండలి ఎన్నికలే అయినా టీఎన్‌టీయుసీ నేతలు మాత్రం సీరియస్‌గా తీసుకుని, ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొని వ్యూహాలు పన్నాడం గమనార్హం. ఏది ఏమైనా రాష్ట్రంలోనూ, నగరంలోనూ అధికారంలో ఉన్న టీడీపీకి కార్మిక సంఘాల్లో ప్రాబల్యం అంతంతమాత్రమన్న విషయం ఈ ఫలితాలే చెబుతున్నాయి.
గెలుపొందిన ప్యానల్ అభ్యర్థుల వివరాలు ...
మెజార్టీ డైరెక్టర్ పదవులను కైవశం చేసుకున్న ప్రోగ్రెసివ్ ప్యానల్‌లో గుంజా అజయ్‌కుమార్ (778 ఓట్లు), వేజేండ్ల ప్రభావతి (724ఓట్లు), తిరుమరెడ్డి బ్రహ్మయ్య (699 ఓట్లు), కె దుర్గారావు (722 ఓట్లు), భూపతి గోవింద్‌రావు (714 ఓట్లు), జి ఆంజనేయులు (742ఓట్లు).
ఈశ్వర్ ప్యానల్ అభ్యర్థుల వివరాలు
డి ఈశ్వర్ (819 ఓట్లు) కెఎ రాజ్‌కుమార్ (712 ఓట్లు) జి ప్రకాష్‌సాగర్ (720 ఓట్లు) డివి మురళీ (699 ఓట్లు) ఎవి రామాంజనేయులు (703 ఓట్లు)