కృష్ణ

చంద్రన్న కానుకల పంపిణీకి చర్యలు: మంత్రి ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 17:క్రిస్‌మస్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలో చంద్రన్న కానుకల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. వెలగలేరులో ఆదివారం జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 1.40 కోట్లమందికి, కృష్ణాజిల్లాలో 12.40లక్షల మందికి చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తారన్నారు. నిరుపేద ఇళ్ళలో పండుగ శోభ ఉండాలనే ఆశయంతో సీఎం చంద్రబాబు ప్రతి యేటా కానుకలను ఇస్తున్నారన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సిఎం చంద్రబాబు సమర్ధతకు నిదర్శనమన్నారు. రైతులు రికార్డుస్థాయిలో పంట దిగుబడులను సాధించారన్నారు. పట్టిసీమ నీటితో నాలుగు జిల్లాల్లో 18వేల కోట్ల ఆదాయం లభించిందన్నారు. పోలవరం కుడికాలువకు భూములిచ్చిన రైతులను అభినందించారు. గోదావరి - పెన్న నదులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. 23న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదన్నారు. అందుకే ప్రతిపక్షాలు పోలవరాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నాయన్నారు. 2018కి చింతలపూడి ద్వారా మెట్టప్రాంతానికి నీళ్ళిస్తామన్నారు. రమణమూర్తి, రంగారావు, ఇతర గ్రామస్తులు టిడిపిలో చేరారు. గ్రామంలో ఇప్పటివరకూ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలకు వెచ్చించిన మొత్తాలను వివరించారు. రైతురథం కింద ట్రాక్టర్లను అందచేశారు. కొల్లేటిగూడెంలో అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. వెలగలేరులో 85లక్షలతో 1.76 కిమీ సిమెంటు రోడ్లు నిర్మించామన్నారు. ముస్లిం సోదరులు ఎస్‌కె అన్వర్‌బాబు తదితరులు మంత్రి ఉమ ను ఘనంగా సత్కరించారు. ఉర్ధూఘర్, షాదీఖానా నిర్మించాలని వారు మంత్రిని కోరారు. ఇదిలా ఉండగా టిడిపిలోని మరో వర్గం ఈకార్యక్రమానికి దూరం గా ఉంది. ఈకార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, జువ్వా రాంబాబు, వుయ్యూరు నరసింహారావు, చనమోలు పకీర్రాయుడు, పటాపంచుల నరసింహారావు, సుకవాసి శ్రీహరి, గరిమెళ్ళ గోపాలరావు, కుక్కల శ్రీనివాసరావు, చనమోలు శ్రీనివాసరావు, శ్రీకాం త్, లంకా లితీష్, రామకృష్ణ, గ్రామనాయకులు తదితరులు పాల్గొన్నారు.