కృష్ణ

ప్రజాదరణ కోల్పోయే పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరులపాడు, డిసెంబర్ 17: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజాదరణ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. నందిగామ నియోజకవర్గ సీపీఐ 18వ మహాసభలు మండలంలోని చెన్నారావుపాలెం గ్రామంలో షేక్ తారాబీ, చుండూరు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ముందుగా సభా ప్రాంగణంలో మండల పార్టీ కార్యదర్శి కుసుమరాజు ప్రకాశరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ కార్యదర్శి జరబన నాగేశ్వరరావు అతిథులను సభ వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి 18మంది అమరులైన నాయకులకు సంతాపం ప్రకటించారు. మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ, మరో అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో అన్నివర్గాల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఈ సభలో నాయకులు వట్టికొండ చంద్రమోహన్, మనె్నం నారాయణరావు, జెట్టి నారాయణబాబు, బం డారు వెంకట్రావు, రాజేంద్రబాబు, వీరులపాడు సర్పంచ్ గడ్డం కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.