కృష్ణ

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, డిసెంబర్ 17: కుల, మత, రాజకీయాల కతీతంగా అట్డడుగు వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేదే ప్రభుత్వాశయమని ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ నాయకులను పని చేసే వారిని ఎన్నుకోవడం వలననే నేడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో పంచాయతీ శివారు చినపత్తిపాడు గ్రామాల్లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను, రూ. 95 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను, రూ. 19 లక్షల వ్యయంతో పెదపాలపర్రు నుండి చినపత్తిపాడుకు వేసిన తారురోడ్డును ఆయన ఆదివారం ప్రారంభించారు. తమ గ్రామానికి రాత్రి వేళ రావాలంటే విద్యుత్ దీపాలు లేవని, గ్రామంలో ఇంకనూ అంతర్గత రహదారులు, బురదకయ్యాలుగా వర్షాకాలంలో మారుతున్నాయని సిసి రోడ్లు ఇంకనూ నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు మంత్రికి తమగోడును వెళ్లబోసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ఈ క్రమంలో తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో 22 మందికి ఇండ్లస్థలాలు ఇవ్వడం జరుగుతుందని గ్రామ కమిటీ సభ్యులే అట్టడుగున ఉన్న వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఇంకనూ గ్రామంలో స్థలాల సమస్యలుంటే పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీనిచ్చారు. క్రిస్టమస్, సంక్రాంతి, రంజాన్ పండుగల సమయాల్లో పేదవారు సహితం సంతోషంగా పండుగ జరుపుకోవాలని కాంక్షించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీటీసీ భూపతి నాగకళ్యాణి, ఎంపీపీ పోసినకుమారి, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎర్నేని లక్ష్మణప్రసాద్, జిల్లా టీడీపీ నాయకులు చలసాని జగన్మోహనరావు తదితర నాయకులు, ఆర్‌డిఓ చక్రపాణి, తదితర అధికార సిబ్బంది పాల్గొనగా మండల టీడీపీ అధ్యక్షులు చళ్లగుళ్ల శోభనాద్రిచౌదరి అధ్యక్షతన కార్యక్రమాలు జరిగాయి.