కృష్ణ

నేటి నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 17: నేటి నుండి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ప్రజలపై భారాలు మోపే జీవో నెం.279ని రద్దు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నుండి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు విధులకు గైర్హాజరు కానున్నారు. తమ డిమాండ్‌ల సాధన కోసం ఆయా పురపాలక సంఘాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు నేటి నుండి పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి తమ నిరసన తెలియచేయనున్నారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల్లో సుమారు 5వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు నిలిచిపోనున్నాయి. ప్రధానంగా జీవో నెం. 279 రద్దుతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జీపీఎఫ్ అకౌంట్లు 010 పద్దులో జీతాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మె జరుగుతోంది.