కృష్ణ

కమనీయం.. బాబావారి పల్లకీ ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 28: స్థానిక ద్వారకామాయి నగర్‌లో వేంచేసి వున్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిర 22వ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం బాబావారి పల్లకీ ఉత్సవం కమనీయంగా సాగింది. బాబా భక్త సమాజం సభ్యులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన 18 పల్లకీలు, పవిత్ర జల కలశాలతో దాదాపు 1500 మంది మహిళలు నూజివీడు రోడ్ నుండి బాబా మందిరం వరకూ కోలాహలంగా పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా తీన్‌మార్ బ్యాండు సన్నాయి మేళాలు, బాణసంచా మోతలతో మైలవరం పట్టణం దద్దరిల్లింది. మైలవరం పట్టణంలోని రామకృష్ణా కాలనీ, సూరిబాబుపేట, రాజాపేట, రెడ్ల బజారు, కోటవెనుక, నూజివీడు రోడ్‌తో పాటు మాధవరం, కుదప, రుద్రవరం, రామచంద్రాపురం, చిలుకూరివారిగూడెం, చండ్రగూడెం, కోడూరు, గణపవరం, చంద్రాల, పొందుగల, వెల్వడం గ్రామాలలో ఉదయం 6గంటల నుండి 8గంటల వరకూ పల్లకీ ఉత్సవాలు నిర్వహించుకుని 9గంటలకు స్థానిక చలవాది కల్యాణ మంటపం వద్దకు చేరుకుంది. అక్కడి నుండి ఊరేగింపుగా బాబా మందిరానికి చేరుకోగా, భక్తులు తెచ్చిన పవిత్ర జలాలతో బాబావారికి అభిషేకం చేశారు. అనంతరం బాబావారికి అన్నాభిషేకం కన్నులపండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బాబా భక్త సమాజం సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.