కృష్ణ

ఎంసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: విద్యార్థుల భవితవ్యాన్ని నిర్థారించే ఎంసెట్ పరీక్షలు శుక్రవారం జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,92,296 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 546 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక విజయవాడ రీజియన్ పరిధిలో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జిల్లా కలెక్టర్ బాబు ఎ, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, రీజనల్ కో-ఆర్డినేటర్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎవి రత్నప్రసాద్‌ల నేతృత్వంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా ఎంతో పకడ్బంధీ ఏర్పాట్లు జరిగాయి. అలాగే ఎపిఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు నేతృత్వంలో ఇటు విజయవాడ అటు మచిలీపట్నంలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి అభ్యర్థుల కోసం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి రామారావు సారథ్యంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. హాల్‌టిక్కెట్ కలిగిన వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఇక విజయవాడ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్‌కు 23,246 మంది పరీక్షా రాయాల్సి ఉండగా వారి కోసం 48 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే మధ్యాహ్నం నుంచి జరిగే మెడిసిన్, అగ్రికల్చరల్ పరీక్షకు 18,978 మంది రాయాల్సి ఉండగా వారి కోసం 38 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మెడిసిన్ అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది ఇంజనీరింగ్ పరీక్షకు 23,069 మంది, మెడిసిన్ పరీక్షకు 17,630 మంది మాత్రమే రాయటం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,87,968 మంది ఇంజనీరింగ్, 1,01,972 మంది మెడిసిన్, ఈ రెండు పరీక్షలు 1191 మంది రాయబోతున్నారు. ఒక్క విజయవాడలోనే 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 1,60,000 ఉండగా కేవలం 1,87,968 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అంటే దాదాపు ప్రతి ఒక్కరికీ సీటు ఖాయం. ఇక మెడిసిన్‌లో 3100 సీట్లు ఉండగా రికార్డు స్థాయిలో లక్ష మందికిపైగా దరఖాస్తు చేశారు. అంటే ఒక్కొక్క సీటుకు 325 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం విజయవాడ రీజియన్‌లో 48 మంది పరిశీలకులు 1760 మంది ఇన్విజిలేటర్లు, 15 మంది ప్రత్యేక పరిశీలకులు, 48 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇతర సిబ్బంది నియమితులయ్యారు.