కృష్ణ

తెలుగుజాతికి గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 12: నానో టెక్నాలజీలో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న చెన్నుపాటి జగదీష్ తెలుగుజాతి గర్వవించ దగ్గ వ్యక్తి అని, ఇలాంటి వ్యక్తిని సత్కరించుకోవటం అందరి అదృష్టమని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు గ్రహీత, నానో టెక్నాలజీ శాస్తవ్రేత్త చెన్నుపాటి జగదీష్‌కి మండలంలోని వల్లూరుపాలెం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం రాత్రి పౌర సన్మానం జరిగింది. వల్లూరుపాలెంలో జన్మించి ఇక్కడ చదివి ప్రపంచ శాస్తవ్రేత్తగా ఎదిగి 37 సంవత్సరాల తరువాత సొంత గ్రామానికి వచ్చిన జగదీష్‌ను సన్మానించటం గొప్పగా ఉందని బుద్దప్రసాద్ అన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారన్న సత్యాన్ని జగదీష్ నెరవేర్చారని అన్నారు. జగదీష్ కిరోసిన్ దీపం కింద పేదరికంతో, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగారని, అందువల్ల ఎవరూ ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడకుడదన్నారు. మరో ముఖ్యఅతిథి జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ చెన్నుపాటి జగదీష్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు పొందటం మన దేశానకి, తెలుగుచాతికి గర్వకారణమన్నారు. విలేకానందస్వామి జయంతి రోజున జగదీష్‌ని సన్మానించటం గొప్పగా ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాంబిరెడ్డి, శ్రీనివాసరావు తోడ్పాటుతోనే ఈ స్థాయికి ఎదిగానని జగదీష్ అన్నారు. నానో టెక్నాలజీ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అని, త్వరలో కేన్సర్ చికిత్సకు అది సూక్ష్మ మందుని తీసుకురానున్నదని వెల్లడించారు. విద్యతోనే ఏ దేశామైనా గౌరవిస్తుందని, అందుచేత ప్రతి బిడ్డనూ తప్పకుండా చదివించాలంటూ గ్రామంలో విద్యాభివృద్ధికి రూ.2లక్షలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కేసీపీ సీఓఓ జి వెంకటేశ్వరరావు, డీఈఓ ఎంవి రాజ్యలక్ష్మీ, రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, గ్రామసర్పంచ్ మాదాల రంగారావు, తోట్లవల్లూరు సర్పంచ్ ఉమాదేవి, ఏంపీటీసీ సభ్యురాలు చెన్నుపాటి స్వరూపరాణి, తహశీల్దార్ జి భద్రు, గొట్టిపాటి రామకృష్ణ, బండి శ్రీమన్నారాయణ, ఎస్‌వి కృష్ణారావు, చెన్నుపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడి ఎత్తిపోతలతో 5లక్షల ఎకరాలు సస్యశ్యామలం
విస్సన్నపేట, జనవరి 12: చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పూర్తయి వినియోగంలోకి వస్తే పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని 5లక్షల ఎకరాలకు పైగా సాగుభూములకు నీరువెళ్ళి సస్య శ్యామలం అవుతాయని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపురం గ్రామ సమీపంలో జరుగుతున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను శుక్రవారం పలువురు అధికారులతో కలిసి శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం 2వ ఫేజ్ పనులకు గాను 142కోట్ల నిధులు మంజూరయ్యాయని, అవినీతికి తావ్వివకుండా నాణ్యత ప్రమాణాలతో కాలువ పనులు పూర్తి చేస్తామని అన్నారు. వేంపాడు మేజర్ కాలువ 10వ కిలోమీటరు వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం కలిసి అక్కడ నుండి ఎన్‌ఎస్‌పి కాలువ 3వ జోన్ పరిధిలోని 21వ మొయిన్‌బ్రాంచిలో కలిసి గోదావరి జలాలు కృష్ణాజలాలతో కలుస్తాయని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాలువ ద్వారా 25వేల ఎకరాలు, కొవ్వాడ కాలువ ద్వారా 25వేల ఎకరాలు, తమ్మిలేరు జలాశయం ద్వారా 25వేల ఎకరాలు సాగవుతుందని చెప్పారు. ప్రస్తుతం సాగవుతున్న భూములతో పాటు మరో 2లక్షల ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు అందిస్తామని, ఇవి గాక ముఖ్యమంత్రి చంద్రబాబు విస్సన్నపేట చింతలపూడి పైలాన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఈప్రాంత రైతుల కోరిక మేరకు కృష్ణాజిల్లాలోని నూజివీడు, ముసునూరు మండలాలకు చెందిన 50వేల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు అంగీకరించినందువల్ల ఆయా భూములను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం వద్ద జల్లేరు జలశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకుగాను కట్ట సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈఈ వై శ్రీనివాసరావు, డిఈ సుబ్రమణ్యశ్వరరావు, ఎఈ రాజకుమారి, వేంపాడు మేజరుకాలువ డీసీ మాజీ చైర్మన్ తుమ్మల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.