కృష్ణ

ఉత్సాహభరితంగా కబడ్డీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, జనవరి 13: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్టీ పోటీలు 2వ రోజైన శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. పుదుచ్చేరి రాష్ట్రంలో ఉన్న కేంద్ర క్రీడల శాఖ పరిధిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ జట్లు పాల్గొన్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దాదాపు 31 జట్లు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీ తొలి నుంచి ఆధిక్యం ప్రదర్శించిన అమరావతి, తూర్పుగోదావరి బాలికల జట్లు విజయం సాధించాయి. 15 విడతలు జాతీయ జట్టులో ఆడిన ఫాతీమా, తిరుపతమ్మ లీగ్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలైన జట్లకు ఆదివారం జరిగే ముగింపు సభలో బహుమతులు అందచేస్తామని నిర్వహకులు తెలిపారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ ఆటలను పర్యవేక్షించారు. మేఘా సంస్థల అధినేత పీపీ రెడ్డి దంపతులు, రవిరెడ్డి దంపతులు, గ్రామ మాజీ సర్పంచ్ వీరారెడ్డి దంపతులు పోటీలను వీక్షించారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, 2వ బహుమతి రూ.75వేలు, 3వ బహుమతి రూ.50వేలు ప్రకటించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకాలు అందించనున్నారు. కబడ్డీ పోటీలను వీక్షించేందుకు ఇతర జిల్లాలు నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేశారు.

భద్రిరాజుపాలెం పీఏసీఎస్
కుంభకోణం కేసులో ఇద్దరి అరెస్టు

తోట్లవల్లూరు, జనవరి 13: మండలంలోని భద్రిరాజుపాలెం పిఎసిస్‌లో రూ.44 లక్షల కుంభకోణం కేసులో అధ్యక్షుడు చాగంటిపాడు శివశంకరరెడ్డి, క్యాషియర్ కుక్కలమూడి బంగారయ్యను శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఎస్‌ఐ ప్రసాద్ అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటంతో ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం ఎస్‌ఐ ప్రసాద్‌ను సంప్రదించగా శివశంకరరెడ్డి, బంగారయ్యను అరెస్ట్ చేసినట్టు నిర్ధారించారు. పిఎసిఎస్‌లో రైతులు, డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలలోను సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు సంఘ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు తెలియకుండా లక్షల్లో లోన్లు తీయటం, రైతులు, డ్వాక్రా మహిళలు కట్టిన అప్పులను పిఎసిఎస్ ఖాతల్లో జమ చేయకుండా అక్రమాలకు పాల్పడటం, పిఎసిఎస్ నుంచి కెడిసిసి బ్యాంకులో జమ చేయాల్సిన నిధులను జమ చేయకపోవటం లాంటి అవినీతికి సిబ్బంది పాల్పడ్డారు. దీంతో ఈ అవినీతి ఆరోపణలపై సహకారశాఖ కో ఆపరేటివ్ అధికారి శివశంకరరెడ్డి గతేడాది సుమారు ఆరునెలల పాటు విచారణ నిర్వహించారు. క్యాషియర్ బంగారయ్య, పిఎసిఎస్ ముఖ్య కార్యదర్శి ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి అవినీతికి పాల్పడినట్టు విచారణాధికారి తేల్చారు. అయితే బంగారయ్య సుమారు రూ.10 లక్షలు తిరిగి చెల్లించారు. పిఎసిఎస్ అధ్యక్షుడు శివశంకరరెడ్డి క్యాష్ బుక్‌లపై సంతకాలు చేయటంతో అవినీతికి ఆయన కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. విచారణ పూర్తయిన చాలా నెలల తరువాత పోలీసులు రహస్యంగా అధ్యక్షుడు శివశంకరరెడ్డి, క్యాషియర్ బంగారయ్యలను అరెస్ట్ చేశారు. ముఖ్య కార్యదర్శి ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని ఎస్‌ఐ చెప్పారు.