కృష్ణ

సంక్రాంతి రద్దీతో జంక్షన్ పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, జనవరి 13: తెలుగు ప్రజల జీవితాల్లో కాంతులు నింపే సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకునేందుకు స్వరాష్ట్రానికి వస్తున్న ఉభయగోదావరి జిల్లావాసుల తాకిడితో జాతీయరహదారి కిక్కిరిసిపోతోంది. చైనే్న-కోల్‌కత్తా జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. దీంతో హనుమాన్ జంక్షన్ వాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. బాపులపాడు, పెదపాడు, నూజివీడు మండలాలకు కూడలిగా హనుమాన్ జంక్షన్ నిత్యం రద్దీగా వుంటుంది. సంక్రాంతి పుణ్యమాని వివిధ ప్రాంతాల నుంచి జంక్షన్ కూడలి దాటి గోదావరి జిల్లాలకు వెళ్ళుతున్న వారితో కిటకిటలాడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి పెరుగుతున్న వాహనాల రద్దీ శనివారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. కూడలి వద్ద స్థానికులు రోడ్డు దాటి అవతలిపక్కకు వెళ్ళాలంటే 30 నిముషాలుపైగా పడుతోంది. వాహనాల రద్దీకి అనుగుణంగా జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బారులుదీరిన వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఇద్దరు డిఎస్పీలు, సిఐ, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. వీరికి విడతలవారిగా డ్యూటీలు వేసి ట్రాఫిక్‌ను మళ్ళింస్తున్నారు.