కృష్ణ

హైలెస్సా.. హైలెస్సా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జనవరి 13: స్థానిక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వేదికగా శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సంప్రదాయ పడవల పోటీలు దివిసీమవాసులను విశేషంగా ఆకర్షించాయి. మరుగున పడిపోతున్న సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు దివిసీమ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో గత యేడాది జిల్లా స్థాయికి పరిమితమైన పడవల పోటీలను ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో చేపట్టి సంస్కృతి, సాంప్రదాయాల పట్ల తనకున్న మక్కువను మరోసారి రుజువు చేసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో తొలిరోజు నిర్వహించిన పోటీలకు విశేష ఆదరణ లభించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి 27 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిష్ణాతులైన జలక్రీడల నిపుణుల పర్యవేక్షణలో అందుకు అవసరమైన పడవలను ఈ పోటీలలో తొలి సారిగా వినియోగించటం విశేషం. ఈ పోటీలను చూసేందుకు జిల్లా వాసులే గాక ఇతర జిల్లాకు చెందిన క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పుష్కర ఘాట్‌కు తరలివచ్చారు. కృష్ణా జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో మొట్టమొదటిగా విజయవాడ పర్యాటక, సాంస్కృతిక కార్యక్రమాలకు నెలవుగా ఉంటుండగా ఇప్పుడు నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం వద్దగల పుష్కరఘాట్ ఈ విధమైన జలక్రీడల పోటీలకు నాంది పలుకుతోంది. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్ల వ్యయంతో జలక్రీడల అకాడమీ ఏర్పాటుకు సైతం పడవ పోటీల సాక్షిగా శంకుస్థాపన పడటంతో ఈ ప్రాంత రానున్న రోజుల్లో పర్యాటకంగా భాసిల్లనుంది. జలక్రీడలు నిర్వహిస్తున్న నాగాయలంకలో కృష్ణా తీరానికి మధ్య భాగంలో గల ద్వీపాన్ని పర్యాటక శాఖ గుర్తించటం ద్వారా ఆ ద్వీపానికి నవ్యలంకగా నామకరణం చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంతో పాటు సంక్రాంతి సందర్భంగా ఓ ప్రత్యేక శైలిలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏసీ భవనాన్ని నిర్మించటం కొసమెరుపు.