కృష్ణ

పోర్టు భూములపై సమగ్ర నివేదిక తయారు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 17: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ విషయంలో సమగ్రమైన నివేదిక తయారు చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముడ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో ముడ అధికారులతో పోర్టు భూముల సమీకరణ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని పోర్టు ప్రతిపాదిత భూముల రైతుల ముఖాముఖి తర్వాత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పోర్టుకు భూములు ఇవ్వని రైతులు భూసమీకరణ ద్వారా ఇస్తారా? భూసేకరణ ద్వారా ఇస్తారా? లేక రెండు విధాలుగా ఇస్తారా? అనే అంశంపై చేపట్టిన రైతుల అభిప్రాయ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు వారి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అలాగే ఇప్పటివరకు పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ప్రకారం ఫ్లాట్లు ఇవ్వాలంటే ఎంత మేర భూమి కావాలో గుర్తించాలన్నారు. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమీక్షలో జి ప్లస్ 3 గృహ సముదాయం, బీసీ భవన్ నిర్మాణానికి అవసరమైన భూములపై చర్చించారు. ఏయే ప్రాంతంలో ఎంత భూమి అందుబాటులో ఉందనే అంశంపై సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, టీడీపీ మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్ (నాని), ముడ డెప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.