కృష్ణ

టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్/కంచికచర్ల, జనవరి 17: సంక్రాంతి పండుగకు హైదరాబాదు నుండి స్వగ్రామాలకు తరలివచ్చిన ఆంధ్రా ప్రాంతీయులు బుధవారం వివిధ వాహనాల్లో తిరుగు ప్రయాణం అవ్వడంతో 65వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కనబడింది. కంచికచర్ల మండలం కీసర, వత్సవాయి మండపం గట్టు భీమవరం టోల్‌ప్లాజాల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గానూ పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూళ్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు గానూ అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుండి రాత్రి వరకూ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కనబడింది. ఒకే సారి ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి. జాతీయ రహదారిపై చీమల దండుగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి.