కృష్ణ

‘వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఖాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 17: వచ్చే ఎన్నికలలో వైసీపీకి అధికారం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలనుండి విశేషమైన ఆదరణ లభిస్తుందని జగన్ నేతృత్వంతో వైసీపీ అధికారం చేజిక్కించుకోనుందని ఆయన పేర్కొన్నారు. అడుగడునా జగన్‌కు ప్రజలు అనేక సమస్యలు చెప్పుకుంటున్నారని, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి సూన్యమని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అంతా అర్హులకు కాకుండా పచ్చచొక్కాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. అనేక మంది అర్హత కలిగిన వారు అన్యాయమైపోతున్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందని, తద్వారా రాజన్న రాజ్యం ఏర్పడుతోందన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నవరత్నాలతోనే రాష్ట్రంలో పరిపూర్ణమైన అభివృద్ధికి బాటలు వేయటం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుండి వేలాది ఎకరాల పొలాలు లాక్కోవటం, పరిశ్రమల స్థాపన పేరుతో విదేశీ పర్యటనలు మినహా జరిగిన అభివృద్ధి సూన్యమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఆనాడు వైఎస్సార్‌తోనే సాధ్యమైందని, నేడు జగన్‌తోనే సాధ్యమవుతోందన్నారు.

చిరుత గుర్తింపు కోసం అధికారుల చర్యలు
జి.కొండూరు, జనవరి 17: చిరుత కదలికల గుర్తింపు కోసం అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు యంత్రాంగం కూడా దీనిపై అప్రమత్తమైంది. జి.కొండూరు మండల సరిహద్దు గ్రామమైన దుగ్గిరాలపాడు, వీరులపాడు మండల పరిధిలోని గూడెం మాధవరం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ళలో, అనుమానిత ఏరియాల్లో అత్యాధునిక టెక్నాలజీ నైట్ విజన్‌తో కూడిన కెమెరాలను అమర్చారు. ఇప్పటికే అటవీ శాఖాధికారులు జంతువుల వెంట్రుకలను సేకరించారు. పాదముద్రల ఆనవాళ్ళు గుర్తించారు. కాగా లభ్యమైన వెంట్రుకలు చిరుతవా లేక పొనుగుపిల్లికి చెందినవా అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే చిరుత గాండ్రింపులు, దాన్ని చూసినట్లుగా చెబుతున్న రైతులను సమగ్రంగా విచారించారు. అసలు ఇక్కడ చిరుత తిరుగుతుందా? లేదా? అనే విషయంపై సీసీ కెమెరాల నుంచి వీడియో దృశ్యాలు రికార్డ్ అయితేనే స్పష్టత లభిస్తుంది. మరోపక్క రెండు గ్రామాల ప్రజలు మాత్రం భయంతో వణికి పోతున్నారు. చిరుత తిరుగుతున్నదనే ప్రచారంతో రాత్రి 6గంటలు దాటితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావడం లేదు. నూజివీడు డిఎస్పీ వి శ్రీనివాసరావు కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. రాజమండ్రి నుంచి రెస్క్యూ వాహనాన్ని దుగ్గిరాలపాడు రప్పించారు. ఒకవేళ చిరుత, మరేదైనా క్రూర జంతువు దొరికితే రెస్క్యూ వాహనంలో తరలించడానికి నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు. పోలీసులు కూడా చిరుతను గుర్తించడానికి, అటవీ అధికారులకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌ఐ డి రాజేష్ వెల్లడించారు. డిఎఫ్‌ఒ బెనర్జీ, ఎఫ్‌బిఒలు హరిబాబు, సుకుమార్, ఎబిఒ సుధాకర్ తదితరులు చిరుతను గుర్తించడానికి శ్రమిస్తున్నారు.