కృష్ణ

నక్షత్ర వైన్స్‌లో ఎక్సైజ్, వన్‌టౌన్ పోలీసుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 18: గుడివాడ పట్టణంలోని చెంచుపేటలో ఉన్న నక్షత్ర వైన్స్‌లో ఎక్సైజ్, వన్‌టౌన్ ఎస్‌ఐలు తాతారెడ్డి, టీ వీరవెంకటేశ్వరరావులు గురువారం తనిఖీలు చేశారు. చెంచుపేటలోని రైస్‌మిల్లులో మెగా వైన్స్ ఏర్పాటు పేరుతో ఆంధ్రభూమి కృష్ణా ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా వైన్స్ షాపు పరిసరాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే గోడౌన్‌లో బార్ అండ్ రెస్టారెంట్‌ను తలపించేలా ఏర్పాటు చేసిన టేబుల్స్‌ను తొలగించారు. వైన్స్ షాపు ఎదుట తోపుడు బండ్ల వ్యాపారం చేస్తూ మద్యం తాగేందుకు సహకరిస్తున్న వారిపై వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వైన్స్ షాపు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్‌ఐ తాతారెడ్డి మాట్లాడుతూ రైస్‌మిల్లు ఆవరణలో వైన్స్ షాపు ఏర్పాటుకు అనుమతులివ్వడం తన పరిధిలో లేని అంశమన్నారు. గోడౌన్‌లో మద్యం తాగించడం చట్ట విరుద్ధమన్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన టేబుల్స్‌ను తొలగింపజేశామన్నారు. వైన్స్ షాపు పరిసరాల్లో బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశామని, ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అక్కడి నుండి వచ్చిన ఆదేశాల మేరకు షాపును సీజ్ చేస్తామన్నారు. గోడౌన్‌ను పర్మిట్ రూంగా వినియోగించుకోవాలంటే దాన్ని ఒక గదిగా మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కొలతలు పాటించాలన్నారు. ఇక్కడి మద్యం షాపు నుండి మొబైల్ తరహాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయని, ఎక్కడైనా సమాచారం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వైన్స్ షాపులోనే మద్యం అమ్మకాలు జరపాలని, బయటకు వెళ్ళి అమ్మకాలు జరిపితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ వీరవెంకటేశ్వరరావు మాట్లాడుతూ నక్షత్ర వైన్స్‌లో ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు పడుతున్నారన్న విషయమై ఇప్పటికే వైన్స్ షాపు యజమానులను హెచ్చరించామన్నారు. వైన్స్ షాపు ఎదుట మద్యం తాగేందుకు సహకరిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్‌కు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే చర్యలను ఉపేక్షించేది లేదని ఎస్‌ఐ వీరవెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్‌ఐ తాతారెడ్డి మద్యం వ్యాపారులతో స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో సమావేశాన్ని నిర్వహించి నిబంధనలకనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం అమ్మకాలు
* వెలవెలబోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కూచిపూడి, జనవరి 18: ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన ధాన్యం ధర కన్నా బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పలకటంతో రైతులు కల్లాల్లోనే కాటాలు వేసి అమ్ముకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు అమలు రైతులకు అసాధ్యం కావటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల కన్నా బహిరంగ మార్కెట్‌లో అధిక ధర రావటంతో పాటు నాణ్యత ప్రమాణాల పట్టువిడుపుల దృష్ట్యా ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. సాధారణ రకం 75కిలోల బస్తా రూ.1162, ఏ గ్రేడ్ రకం రూ.1192 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించగా బహిరంగ మార్కెట్‌లో సాధారణ రకం రూ.1300, ఏ గ్రేడ్ రకం రూ.1530 ధర పలుకుతుండటమే గాక కొనుగోలు దారులే స్వయంగా పొలాల్లోకి కాటాలు వేసుకుని రవాణా చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు, ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇటీవల సకాలంలో సొమ్ము బ్యాంక్‌లలో జమ కాకపోవటంతో డబ్బుల కోసం రైతులు అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తోందని కూడా విమర్శిస్తున్నారు.