కృష్ణ

విద్యావ్యవస్థపై దేశ భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జనవరి 18: దేశ సర్వతోముఖాభివృద్ధి ఒక్క విద్యావ్యవస్థ పైనే ఆధారపడి ఉందని రాష్ట్ర మానవవనరుల, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబు అవసరం లేదని, విద్యావ్యవస్థ పతనం అయితే దేశమే పతనం అవుతుందని అన్నారు. రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం నూజివీడు ట్రిపుల్ ఐటీలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావిధానం, విద్యావ్యవస్థపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, పెన్ను, పుస్తకానికి ప్రపంచానే్న మార్చే శక్తి ఉందని చెప్పారు. విద్యావ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యాశాఖకు కేటాయిస్తున్నారని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, విడుదల చేస్తున్న నిధులను మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినీ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించి, వారికి బంగారు భవిష్యత్‌ను కల్పించేందుకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, నాలుగు ట్రిపుల్ ఐటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం కోసం వేలాది మంది విద్యార్థులు క్యూ కడుతున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు భవనాలు నిర్మించి, అక్కడే తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నంత మాత్రాన చదువు ఆగలేదని, మరో నూతన జీవితంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొంటూ విద్యార్థులకు లక్ష్యసాధన ఎంతో అవసరమని మంత్రి శ్రీనివాసరావు సూచించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మంత్రి అభినందించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రిపుల్ ఐటీ అధికారులు ఆర్జేయుకేటీ నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేయుకేటీ కులపతి రాజ్‌రెడ్డి, ఉపకులపతి ఆర్ రామచంద్రరాజు, డైరెక్టర్లు వీరంకి వెంకటదాసు, అప్పలనాయుడు, విశ్వవిద్యాలయం ఇసి సభ్యులు వెంకయ్య, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ట్రిపుల్ ఐటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.