కృష్ణ

స్వయం పోషిత స్వతంత్ర పాఠశాల బిల్లుకు నిరసనగా ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జనవరి 19: స్వయం పోషిత స్వతంత్ర పాఠశాలల బిల్లుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం స్వయం పోషిత స్వతంత్ర పాఠశాలల బిల్లును వెబ్‌సైట్‌లో పెట్టి చట్టం చేయాలని యోచిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా అడ్డుకుంటామన్నారు. ఈ బిల్లు వల్ల ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం కావటంతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలు మరింత ఉన్నతి సాధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పి కృష్ణయ్య, బి భానుమతి, టి నాగరాజు, ఆర్ వరుణ్ కుమార్, జిఎస్ శుభాకర్, ఐ రాజేష్, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

డా. కిరణ్‌బాబుకు వైద్యరత్న అవార్డు
బంటుమిల్లి, జనవరి 19: మండల పరిధిలోని ఆముదాలపల్లి గ్రామానికి చెందిన డా. దాసరి కిరణ్ బాబు పిన్న వయస్సులోనే వైద్యరత్న అవార్డును అందుకోనున్నారు. సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్ స్వచ్చంద సంస్థ వారు ప్రతి ఏడాది గ్రామీణ ప్రాంతంలో వైద్య రంగానికి విశిష్ఠ సేవలు అందించిన వారిని గుర్తించి ఈ అవార్డును అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది విజయవాడ సీఎస్‌ఐ మిషనరీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డా. కిరణ్‌బాబు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా డా. కిరణ్ బాబు వైద్యరత్న అవార్డును అందుకోనున్నారు.

పేటలో అట్టహాసంగా రోడ్ల శంకుస్థాపనలు
జగ్గయ్యపేట, జనవరి 19: పట్టణంలో సుమారు 3కోట్ల నిధులకు సంబంధించి 35 అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టారు. ఒకేసారి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అక్బర్, కమీషనర్ రమేష్, కౌన్సిల్ సభ్యులు రాజ్యలక్ష్మి, లలిత, కొర్రకూటి సైదులు, కె విజయలక్ష్మి, ఎంవి చలం, షరాబు వర్తక సంఘం నేత శ్రీరాం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్భాటంగా శంకుస్థాపనలు
తీన్ మార్ వాయిద్యాలతో ఒక ఆటో, దాని వెనుక ద్విచక్ర వాహనాలపై ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ వారిని అనుసరిస్తూ నేతలు, ఆ తరువాత నేతల కార్లు, ఇలా ర్యాలీగా వార్డుల్లో శంకుస్థాపనలకై పర్యటిస్తున్న నేతలను పేట వాసులు ఏమి జరుగుతుందో తెలియక ఆసక్తిగా గమనించారు. డప్పుల శబ్దం విని బయటకు వచ్చిన మహిళలు, పేటవాసులకు నేతలు రావడం, అనుకున్న ప్రదేశంలో శంకుస్థాపన రాయి పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం ఎవరి వాహనాలతో వారు వెళ్లిపోవడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియక పేటవాసులు కొంత ఆందోళనకు సైతం గురయ్యారు. ఏది ఏమైనా ఒకే సారి 30కి పైగా కార్యక్రమాలకు శంకుస్థాపనలు అట్టహసంగా చేయడం పట్ల పేట వాసులు ఆశక్తిగా చర్చించుకుంటున్నారు.