కృష్ణ

బ్యాంకింగ్ రంగంలో కెడీసీసీదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, జనవరి 19: జిల్లాలోనే 3వ స్థానంలో కెడీసీసీ బ్యాంక్ ఉందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని వడ్లమన్నాడులో సోమవారం సొసైటీకి చెందిన 200 మెట్రిక్ టన్నుల నూతన గోడౌన్‌లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిన్నమనేని మాట్లాడుతూ అత్యంత ఉత్తమ సేవలను రైతులకు అందిస్తున్న ఏకైక బ్యాంక్ కెడీసీసీ బ్యాంక్ అన్నారు. జిల్లా కలెక్టర్ తమ బ్యాంక్ సేవలను అభినందించి జిల్లాలోనే కెడీసీసీ బ్యాంక్ 3వ స్థానంలో ఉందని ప్రశంసించారన్నారు. ఇతర బ్యాంకులు ఖాతాదారులకు రూ.60పైసలు వడ్డీ ఇస్తుండగా కెడీసీసీ బ్యాంక్ ఖాతాదారులకు డిపాజిట్లపై 75పైసలు వడ్డీని ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం రైతు రుణమాఫీ చేసింది కెడీసీసీ బ్యాంక్ అన్నారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ బిఎల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వడ్లమన్నాడు సొసైటీకి 110 సంవత్సరాల చరిత్ర, తొమ్మిది గ్రామాల పరిధిగల వడ్లమన్నాడు సొసైటీ డిపాజిట్ల సేకరణల వెనుక ఉందన్నారు. మార్చి నెలలో డిపాజిట్ల సేకరణ ప్రారంభించాలన్నారు. న్యాయవాది పెనే్నరు ప్రభాకరరావు మాట్లాడుతూ సొసైటీ బ్యాంక్ భవనం శిథిలావస్థకు చేరటంతో దాన్ని తొలగించటం జరిగిందని, సొసైటీకి 30 సెంట్ల స్థలం ఉందని, ఈ 30 సెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్‌కి, నూతన సొసైటీ బ్యాంక్ భవనానికి నిధులు కేటాయించాలని చైర్మన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శేషం గోపి, గ్రామ సర్పంచ్ బాలయ్య, ఎఎంసీ మాజీ చైర్మన్ వల్లభనేని వెంకట్రావ్, గుడ్లవల్లేరు సర్పంచ్ వల్లభనేని వెంకట సుబ్బారావు, బ్యాంక్ డైరెక్టర్ సూర్యప్రకాశరావు, వేమవరం డైరెక్టర్ పామర్తి కొండబాబు, గుడ్లవల్లేరు పీఎసీఎస్ అధ్యక్షుడు పొట్లూరి రవి కుమార్, డోకిపర్రు పీఎసీఎస్ అధ్యక్షుడు వీరమాచినేని శివప్రసాద్, అడుసుమిల్లి శ్రీనివాసరావు, రామ్మోహనరావు, గ్రామస్థులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

57 కోతుల తరలింపు
తోట్లవల్లూరు, జనవరి 19: తోట్లవల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో పట్టిన కోతులను శుక్రవారం రాత్రి ప్రత్యేక వ్యానులో నున్న ఏరియాకు తరిలిస్తున్నట్టు సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి తెలిపారు. గత రెండు రోజులుగా కంచికచర్లకు చెందిన వ్యక్తులు 57 కోతులను పట్టి బోనులో బంధించారు. ఈ 57 కోతులను నున్న ప్రాంతంలో వదులుతారని సర్పంచ్ తెలిపారు. ఉపసర్పంచ్ చిరుమామిళ్ళ మోహన్‌మంజు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

విద్యావంతులైన యువత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలి

* ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, జనవరి 19: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ తరుణంలో విద్యావంతులైన యువత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సును ఔత్సాహికులు సద్వినియోగపర్చుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీఎఫ్‌ఎస్‌సీ, ఎపీఐఐసీ ఉన్నతాధికారులు ఔత్సాహికులకు పరిశ్రమల స్థాపనలో తగిన సూచనలు, సలహాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలను వివరించారు. ఈ సమావేశంలో జిఎం సుధాకర్, డెప్యూటి డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటి జోనల్ మేనేజర్ శ్రీనివాసమణి, బుజ్జిబాబు, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహక అధికారి కిషోర్‌రావు తదితరులు పాల్గొన్నారు.