కృష్ణ

డీఎస్సీ కోచింగ్ సెంటర్లను తనిఖీచేసిన ఐటీ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జనవరి 19: స్థానికంగా ఉన్న పలు డీఎస్సీ కోచింగ్ కేంద్రాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గతంలో ప్రగతి విద్యా సంస్థలు, విద్యానికేతన్‌లో ఈ దాడులు జరగ్గా, శుక్రవారం మూకుమ్మడిగా బందరు, విజయవాడలకు చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. అక్షర, సాధన, ప్రజ్ఞ, సాహితి, పూర్ణతో పాటు మరికొన్ని కోచింగ్ కేంద్రాలకు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. వారు మంగళవారం పూర్తి వివరాలతో ఖర్చులు, విద్యార్థుల సంఖ్య తదితర విషయాలను పొందుపరుస్తూ మంగళవారం విజయవాడ ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి రావాలని నోటీసు ఇవ్వటం జరిగింది.