కృష్ణ

శారీరక దృఢత్వాన్ని మరింత పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 19: సాయుధ దళ పోలీసులు శారీరక దృఢత్వాన్ని మరింత పెంపొందించుకోవాలని జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ అన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది అవగాహన కోసం ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో 15 రోజుల పాటు సాయుధ దళ పోలీసులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ సాయుధ దళ పోలీసులు ముఖ్యంగా శారీరక దారుఢ్యంతో పాటు ఆయుధ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. లాఠీ డ్రిల్లు, మాబ్ ఆపరేషన్, వివిధ ఆయుధాలు ఉపయోగించే విధానం, ఫైరింగ్, పోలీసు ప్రవర్తనా నియమావళి, పౌరులతో మెలగవల్సిన తీరు, వివిధ బందోబస్తులలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాల్సిన విధానం, ఒత్తిడి నియంత్రణ, అధిగమించేందుకు మెళుకువలు, వృత్తిపరమైన నైతిక నియమాలు, పోలీసు పాత్ర, వ్యక్తిగత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు డీఎస్పీ బి నారాయణరావు, ఆర్‌ఐలు నాగిరెడ్డి, శ్రీనివాస్, సాయుధ దళ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యావేత్త ‘మాజేటి’ మృతి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 19: విద్యావేత్త, వితరణ శీలి, ఆధ్యాత్మిక చింతనాపరుడు, శ్రీ లక్ష్మీనృసింహ సోమయాజి వైశ్య సమాజం కార్యదర్శి మాజేటి వెంకట సీతాపతిరావు (78) గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విక్టోరియా మహారాణిచే షావుకారుగా బిరుదు పొందిన తిరువూరు సమీపంలోని వేమిరెడ్డిపల్లి గ్రామ జమిందారయిన వెంకట నాగభూషణరావు మనుమడు సీతాపతిరావు. 1940 జూన్ 6వ తేదీన సుబ్బారావు, తాయారమ్మ దంపతులకు జన్మించిన సీతాపతిరావు 1960లో కర్ణాటక విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. రోటరీ క్లబ్ సభ్యులుగా, అధ్యక్షుడుగా, రోటరీ జిల్లా చైర్మన్‌గా సేవా రంగంలో విశేష సేవలందించారు. 18 సార్లు రక్తదానం చేసి ఉత్తమ సేవా పత్రం, తుఫాన్ సమయంలో సేవలందించి ఉత్తమ రొటేరియన్ అవార్డు అందుకున్నారు. బియ్యం వ్యాపారం వారి వృత్తి అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా ఎన్నో కార్యక్రమాలతో సేవాతత్పరతను చాటుకున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్టు బోర్డు, శ్రీ వాసవీ విద్యార్థి పరిషత్ సభ్యులుగా విశేష సేవలందించారు. శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీవిశే్వశ్వర భక్త హైందవ సాంప్రదాయ పరిరక్షణ సంస్థ, కొల్లిపర లక్ష్మీనరసమ్మ, రావుబహద్దుర్ గంగాధర బాబూరావు కల్యాణ మండపం, వాసవీ విద్యార్థి వసతి గృహంల అభివృద్ధికి నిధులు సమీకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బృందావనపుర గో-సంరక్షణ సంఘం ఉపాధ్యక్షుడుగా, ఉదయపు నడక మిత్ర మండలి మాస పత్రిక ‘ఉదయ ప్రభ’ సంపాదకునిగా, పీపుల్స్‌ఫర్ యానిమల్ ట్రస్టు, గాంధీ కస్తూర్బా సేవా సంఘం, సావిత్రి ఎయిడెడ్ స్కూల్, వాసవీ సేవా సంస్థ, వాసవీ వృద్ధాశ్రమం, శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కార్యవర్గ సభ్యులుగా ప్రశంసనీయమైన సేవలందించారు. ఆయన పార్దీవ దేహాన్ని మాజీ చీఫ్‌విఫ్ పేర్ని వెంకట్రామయ్య(నాని), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మామిడి మురళీకృష్ణ, చిత్తజల్లు సాయిప్రసాద్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పెసల వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.