కృష్ణ

అభివృద్ధి పథంలో మైలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 19: మైలవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 22న జి కొండూరు మండలం వెలగలేరులో ఎత్తిపోతల పథకం, మైలవరం మండలం దాసులపాలెంలో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు 5.20 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈపథకాల ద్వారా 874 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జి కొండూరు మండలం వెలగలేరులో నరసాయిగూడెం చెరువుకు బుడమేరు రైట్ బ్యాంక్‌పై రూ.298.02 లక్షలతో వెలగలేరు-2 ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని దీని ద్వారా పినపాక, కవులూరు, వెలగలేరు గ్రామాలలోని 603.21 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. అదేవిధంగా మైలవరం మండలంలో రూ.222.68 లక్షలతో దాసుళ్ళపాలెం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. దీని ద్వారా 270.45 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈరెండు పథకాల ద్వారా రైతుల కష్టాలు తీరనున్నాయన్నారు. 22న వెలగలేరులో ఉదయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళనున్నట్లు తెలిపారు. 23న మైలవరం మండలం దాసుళ్ళపాలెం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన అనంతరం మైలవరంలో ఇళ్ళ స్థలాల పంపిణీ చేస్తానన్నారు. అనంతరం మైలవరంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇటీవల నూతనంగా నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.1కోటి 47 లక్షల 50వేలతో కీర్తిరాయినిగూడెం, రంగాపురం, రాఘవాపురం గ్రామాల పరిధిలో సిసి డ్రైన్లకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఇంకా పెండింగులో ఉన్న సమస్యలు, గ్రామాల్లో వౌలిక సదుపాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న ప్రతి ఒక్కరికీ స్వచ్చాంధ్ర మిషన్ ద్వారా కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.