కృష్ణ

హంసలదీవిలో పటిష్ట ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జనవరి 21: కోడూరు మండలంలోని హంసలదీవిలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి శాఖల వారీగా ఆయా ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే తగు ఏర్పాట్లను చేసేందుకు చర్యలు చేపట్టారు. అవనిగడ్డ డీఎస్పీ వి పోతురాజు నేతృత్వంలో ఇరువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్ ఆదివారం తెలిపారు. మత్స్యశాఖ ఎఎఫ్‌డీఓ పి రవికుమార్ మాట్లాడుతూ సాగరసంగమం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో 12 బోట్లను అందుబాటులో ఉంచుతామని, 40 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఎఇ పృథ్వీరాజ్ మాట్లాడుతూ పాలకాయతిప్ప కరకట్ట నుంచి డాల్ఫిన్ భవనం వరకు రహదారి మరమ్మతులను పూర్తి చేస్తామని చెప్పారు. ముళ్లపొదలను తొలగిస్తామని చెప్పారు. రక్షిత మంచినీటి శాఖ జూనియర్ ఇంజనీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ శాఖ ద్వారా దిండిమెరకు నుంచి సంసలదీవి సముద్రం వద్దకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ సాయంత్రం వరకు 15 బస్సులను సాగరతీరం వరకు నడుపుతామని చెప్పారు. కోడూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి రుబీనామునం మాట్లాడుతూ దేవాలయం, డాల్ఫిన్ భవనం, సాగరసంగమాల వద్ద వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. 108 వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అటవీ శాఖ రేంజ్ అధికారిణి గంగా భవానీ మాట్లాడుతూ సముద్రం వద్ద నుంచి డాల్ఫిన్ భవనం వరకు రోడ్ల మరమ్మతులు చేసుకోవచ్చన్నారు. డాల్ఫిన్ భవనం వద్ద 10వేల లీటర్ల మంచినీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ లక్ష్మీ మాట్లాడుతూ రెండు రోజులు పాటు ప్రత్యేక బృందాలు ద్వారా బెల్టు షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇఓపీఆర్‌డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాల్ఫిన్ భవనం, సాగరసంగమం వద్ద నాలుగు డ్రసింగ్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, 30 మంది పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉంటారని, మంచినీటి సరఫరాను చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ అర్చకుడు దివి నందకుమార్ మాట్లాడుతూ 31వ తేదీ ఉదయం 11గంటల వరకే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణం కారణంగా అదే రోజు 11.30 నిముషాలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. తిరిగి 1వ తేదీన ఆలయ శుద్ధి అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వటం జరుగుతుందన్నారు. డీఎల్‌పీఓ ఎస్ సత్యనారాయణ, ఆర్డీఓ ఉదయ భాస్కర్, తహశీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, హంసలదీవి సర్పంచ్ కొక్కిలిగడ్డ సముద్రాలు, కెడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరావు, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఎఇఓ సాయిబాబు, ఆలయ పాలకవర్గ సభ్యురాలు విశ్వనాధపల్లి పాప నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.