కృష్ణ

వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, జనవరి 22: సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. వెలగలేరులో ఆయన సోమవారం రూ.2.98 కోట్ల అంచనాలతో వెలగలేరు-2 ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 6 ఎత్తిపోతల పథకాలతో 52కిలోమీటర్ల గ్రావిటీతో, 15 కిలోమీటర్ల పైపులైనుతో ఎన్‌ఎస్‌పి కుడిప్రధాన కాలువకు గోదావరి జలాలను మళ్ళించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వెలగలేరు-2 ఎత్తిపోతల ద్వారా నర్సాయిగూడెం, వెలగలేరు, కవులూరు, పినపాక గ్రామాల్లో 600 ఎకరాలకు పైగా సాగునీరు లభిస్తుందన్నారు. మైలవరం మండలంలో దాసుళ్ళపాలెం ఎత్తిపోతల పథకానికి రూ.2.22కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గోదావరి నుంచి మళ్ళించిన 108 టిఎంసి నీళ్ళలో 90 టిఎంసిలు ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు మళ్ళించగా, మిగిలిన 18 టిఎంసిల నీళ్ళు మెట్టప్రాంత రైతులు వాడుకున్నారన్నారు. 6,500 క్యూసెక్కుల సామర్థ్యం గల కాలువలతో చింతలపూడి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను తాను ఇప్పటి వరకు 51సార్లు సందర్శించగా, సీఎం 23 సార్లు సందర్శించినట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టుల పనులన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. అనంతరం వెలగలేరు జెడ్పీ హైస్కూల్లో అమ్మకు వందనం కార్యక్రమంలో మంత్రి ఉమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చనమోలు అనిల్‌కమార్, పకీర్రాయుడు, జువ్వా రాంబాబు, కొల్లి నాగేశ్వరరావు, ధనేకుల సాంబశివరావు, అధికారులు, సర్పంచ్ మెండ్యాల భూపతమ్మ, ఎంపీటీసీ పోలుదాసు వెంకటలక్ష్మీ, టీడీపీ నాయకులు మంచినీళ్ల రాజశేఖర్, గాలి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.