కృష్ణ

జనసంద్రంగా మారిన నాగులేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 13: స్థానిక చింతగుంటపాలెం నాగులేరు (మంచినీటి కాలువ) శివరాత్రి పర్వదినం సందర్భంగా జనసంద్రంగా మారింది. వేలాదిగా ప్రజలు తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాలువలో నీరు తక్కువగా ఉన్నందున పురపాలక సంఘం ఏర్పాటు చేసిన జల్లు స్నానాలు చేశారు. స్నానం అనంతరం పితృదేవతలకు పిండ ప్రధానాలు చేశారు. సువాసినులైన మహిళలు మూసివాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ రసలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ నాగ సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్ పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలను పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. మంత్రి రవీంద్ర, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముఖేష్ అంబానీకి ఘన స్వాగతం

గన్నవరం, ఫిబ్రవరి 13: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంబానీకి పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువాలతో సత్కరించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్డుకు 5.30 గంటలకు విచ్చేసిన అంబానీ ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబుతో భేటి అయ్యేందుకు అమరావతికి తరలివెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు గురించి చంద్రబాబుతో అంబానీ చర్చించనున్నారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ అంబానీకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జీ మధుసూధనరావు, పోలీసు అధికారులు రమణారావు, గజరావు భూపాల్, రాజీవ్‌కుమర్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.