కృష్ణ

పాతాళ భోగేశ్వరా పాహిమాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, ఫిబ్రవరి 13: స్థానిక శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పంచబుగ్గల కోనేరును దర్శించి అన్నసమారాధనలో మంత్రి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి స్వామివారి కల్యాణం సందర్భంగా ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామివారికి జగజ్యోతి ఉత్సవం, సానారుద్రవరం బృందంచే మురళీ కోలాటం, కలిదిండి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరభద్ర పళ్ళేం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర వైస్ చైర్మన్ సిఎల్ వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, మండల బీజెపీ అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, మార్కెట్ యార్డు చైర్మన్ వల్లభనేని శ్రీనివాస చౌదరి, ఎంపీపీ బండి లక్ష్మి, ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన శివాలయాలు

నాగాయలంక, ఫిబ్రవరి 13: మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం నాగాయలంక, కోడూరు మండలాల్లోని వివిధ శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. స్థానిక శ్రీ వాసవీ కన్యకా నగరేశ్వర స్వామి ఆలయం, గణపేశ్వరంలోని శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయం, టి కొత్తపాలెం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, సంగమేశ్వరంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, స్థానిక కృష్ణాతీరాన గల శివాలయంలో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి వేలాది మంది భక్తులు సమీపంలోని కృష్ణానదిలో స్నానమాచరించి ఆయా ఆలయాలలో పూజలు నిర్వహించారు. కోడూరు, మాచవరం, లింగారెడ్డిపాలెం, హంసలదీవి, పిట్టల్లంక గ్రామాల్లోని శివాలయాలలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. నాగాయలంక మండలంలోని ఆలయాల వద్ద ఎస్‌ఐ కె రాజారెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా, కోడూరులోని శివాలయాల వద్ద కోడూరు ఎస్‌ఐ ఎస్ ప్రియ కుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.